https://oktelugu.com/

AP Jobs 2021: ఏపీ హైకోర్టులో భారీ వేతనంతో జాబ్స్.. డిగ్రీ అర్హతతో?

AP Jobs 2021: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్లు రిలీజయ్యాయి. టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులతో పాటు అసిస్టెంట్, ఎగ్జామినర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 174 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏపీ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుందని తెలుస్తోంది. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. 2021 సంవత్సరం సెప్టెంబర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 13, 2021 1:22 pm
    Follow us on

    AP Jobs 2021: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్లు రిలీజయ్యాయి. టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులతో పాటు అసిస్టెంట్, ఎగ్జామినర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 174 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏపీ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుందని తెలుస్తోంది. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

    2021 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 174 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 71 ఉండగా ఎగ్జామినర్ ఉద్యోగ ఖాళీలు 29, కాపీయిస్ట్ ఉద్యోగ ఖాళీలు 39, టైపిస్ట్ ఉద్యోగ ఖాళీలు 35 ఉన్నాయి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలిగే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కామర్స్, ఆర్ట్స్, సైన్స్, లా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 400 రూపాయలు, ఈడబ్లుఎస్ కు 500 రూపాయలు, మిగిలిన అభ్యర్థులకు 800 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది.

    కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను చేపడతారు. https://hc.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా నిరుద్యోగులు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.