https://oktelugu.com/

ప్రభాస్ ఒకే ఒక్కడు.. ఈ ఘనత సొంతం

డార్లింగ్ ప్రభాస్ యమ జోరు మీద ఉన్నాడు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సంవత్సరానికి నాలుగైదు సినిమాలకు డేట్స్ ఇచ్చి విడతల వారీగా సినిమాలు పూర్తి చేసేవారు. కృష్ణ అయితే ఒక ఏడాది 10 సినిమాలు మొదలుపెట్టి షూటింగ్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఇదే కోవలోకి మన ప్రభాస్ వస్తున్నాడు. బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ నుంచి ఇప్పుడు నాలుగు సినిమాలు ఏకకాలంలో లైన్ లో ఉండడం అంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2021 / 08:55 AM IST
    Follow us on

    డార్లింగ్ ప్రభాస్ యమ జోరు మీద ఉన్నాడు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సంవత్సరానికి నాలుగైదు సినిమాలకు డేట్స్ ఇచ్చి విడతల వారీగా సినిమాలు పూర్తి చేసేవారు. కృష్ణ అయితే ఒక ఏడాది 10 సినిమాలు మొదలుపెట్టి షూటింగ్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఇదే కోవలోకి మన ప్రభాస్ వస్తున్నాడు.

    బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ నుంచి ఇప్పుడు నాలుగు సినిమాలు ఏకకాలంలో లైన్ లో ఉండడం అంటే మాటలు కాదుకదా.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ , ప్రాజెక్ట్ ‘కే’ చిత్రాలు ఉన్నాయి.రాధేశ్యామ్ షూటింగ్ ను ఇటీవలే పూర్తి చేయగా డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ లో ఉంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు ప్రభాస్ ఇప్పటికే తేదీని కూడా ప్రకటించాడు.

    ఇక కేజీఎఫ్ దర్శుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మొదలుపెట్టిన ‘సలార్’ చిత్రం షూటింగ్ ను గోదావరిఖనిలో 30శాతం పూర్తయ్యింది. ఇక ఆ చిత్రానికి బ్రేక్ నిచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమాపై పడ్డాడు. అది 50శాతం వరకు పూర్తయినట్టు తెలిసింది. ఇక కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది.

    ఇక ఇవే కాదు.. ఇటీవలే ప్రకటించిన నాగ్ అశ్విన్ ‘ప్రోజెక్ట్ కే’ సైన్స్ ఫిక్షన్ మూవీని కూడా ప్రభాస్ మొదలుపెట్టాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించాడు. దీంతో ఏకాకలంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్న హీరోగా పేరొందాడు. దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో కూడా ఇప్పటికిప్పుడు నాలుగు సినిమాలు లేకపోవడం విశేషం.