ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీటెక్ పాసైన నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్ విభాగానికి సంబంధించిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఏపీపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
నవంబర్ 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. నవంబర్ 12వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.91,450 వేతనం లభించనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్ సైట్ లో ప్రొఫైల్ ను రిజిష్టర్ చేసుకుని ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.