https://oktelugu.com/

ఎంసెట్ రాసిన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఏపీ ఎంసెట్-2020 అడ్మిషన్ల ప్రక్రియ గడువును విద్యార్థులు సౌకర్యార్థం పొడిగించింది. విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ రాసిన విద్యార్థులకు నవంబర్ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నామని.. మూడవ తేదీలోగా విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెల 27వ తేదీతోనే కౌన్సిలింగ్ గడువు ముగిసింది. అయితే కొంతమంది […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 29, 2020 12:10 pm
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఏపీ ఎంసెట్-2020 అడ్మిషన్ల ప్రక్రియ గడువును విద్యార్థులు సౌకర్యార్థం పొడిగించింది. విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ రాసిన విద్యార్థులకు నవంబర్ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నామని.. మూడవ తేదీలోగా విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు.

    మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెల 27వ తేదీతోనే కౌన్సిలింగ్ గడువు ముగిసింది. అయితే కొంతమంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల కౌన్సిలింగ్ కు హాజరు కాలేకపోయారని తెలిసి అధికారులు గడువును మరింత పొడిగించారు. కౌన్సిలింగ్ కు హాజరైన విద్యార్థులు వచ్చే నెల మూడవ వారంలో కళాశాలలు, కోర్సులు, ఆప్షన్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

    అధికారుల లెక్కల ప్రకారం 82,840 మంది విద్యార్థులకు సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల పరిశీలన ఇప్పటికే పూర్తైంది. https://apeamcet.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఎంసెట్ కౌన్సిలింగ్ కు సంబంధించిన ఇతర సమాచారాన్ని పొందవచ్చు. ఎంసెట్ హెల్ప్ లైన్ సెంటర్లలో కూడా విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎంసెట్ కౌన్సిలింగ్ గడువును పొడిగించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రతి ఏటా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ మే లేదా జూన్ నెలలలో జరిగేది. ఈ సంవత్సరం కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఎంసెట్ పరీక్షలు, కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యాయి. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ (డెహ్రాడూన్)లో ప్రవేశాలకు సంబంధించిన గడువును నవంబర్ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.