https://oktelugu.com/

AIC Recruitment: అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. అర్హులెవరంటే?

AIC Recruitment: న్యూఢిల్లీలో ఉన్న అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు సంవత్సరం పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి. క్లస్టర్ హెడ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 22, 2021 / 07:27 PM IST
    Follow us on

    AIC Recruitment: న్యూఢిల్లీలో ఉన్న అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు సంవత్సరం పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి. క్లస్టర్ హెడ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    Also Read: ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ల పెంపు?

    AIC Recruitment

    సంబంధిత విభాగాలలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ/డిప్లొమా(అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)/ఎంబీఏ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. http://www.aicofindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. ఉద్యోగంలో అనుభవం ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

    Also Read: రైల్వేలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?