https://oktelugu.com/

Bigg Boss: సన్నీ – కాజల్ పై చేసిన కామెంట్స్ కు క్లారిటి ఇచ్చిన… కమెడియన్ సుదర్శన్

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5 లో తమదైన శైలిలో గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు ఇంటి సభ్యులు. అయితే నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ కి ‘అనుభవించు రాజా’ సినిమా టీమ్ అతిథులుగా వచ్చారు. ఇందులో కమెడియన్ సుదర్శన్ కూడా ఉన్నాడు. స్టేజ్ పైకి వచ్చిన ఆయన హౌస్ మేట్స్ పై పంచ్ లు వేస్తూ నవ్వించారు. అయితే కాజల్-సన్నీల రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడాడు సుదర్శన్. అప్పటివరకు సన్నీ, కాజల్ ల గేమ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 07:39 PM IST
    Follow us on

    Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5 లో తమదైన శైలిలో గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు ఇంటి సభ్యులు. అయితే నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ కి ‘అనుభవించు రాజా’ సినిమా టీమ్ అతిథులుగా వచ్చారు. ఇందులో కమెడియన్ సుదర్శన్ కూడా ఉన్నాడు. స్టేజ్ పైకి వచ్చిన ఆయన హౌస్ మేట్స్ పై పంచ్ లు వేస్తూ నవ్వించారు. అయితే కాజల్-సన్నీల రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడాడు సుదర్శన్. అప్పటివరకు సన్నీ, కాజల్ ల గేమ్ గురించి ఫన్నీగా పంచ్ లు వేసిన సుదర్శన్… కాజల్ ని ఉద్దేశిస్తూ ‘మీరు అలిగినప్పుడు చాలా బాగుంటుంది. సన్నీ వచ్చి ఓదార్చడం. అదో టైప్ రొమాన్స్ బాగుంది అని అన్నాడు.

    దీంతో షాకైన సన్నీ.. ‘మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో సన్నీ, కాజల్ అభిమానులు  కమెడియన్ సుదర్శన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉంటున్న వాళ్లు మీకు రొమాన్స్ చేస్తూ ఎప్పుడు కనిపించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా సుదర్శన్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ను విడుదల చేశాడు.

    స్టేజ్ పై ఉన్నప్పుడు హౌస్ మేట్స్ తో చాలా మాట్లాడానని సన్నీ- కాజల్ లతో కూడా మాట్లాడానని చెప్పారు. కానీ ఎడిటింగ్ వల్ల కేవలం అది తప్పుగా బయటికి వచ్చిందని వెల్లడించారు. సన్నీ-కాజల్ ల రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం తనకు లేదని చెప్పారు సుదర్శన్. అలానే ఈ విషయంలో బాధ పది ఉంటే సన్నీ, కాజల్ ఫ్యామిలీ లకు, ఫ్యాన్స్ తనను క్షమించాలని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.