https://oktelugu.com/

BCPL Recruitment: బీసీపీఎల్‌లో 36 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

BCPL Recruitment: బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మొత్తం 36 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ జనరల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీ జరగనుంది. మార్కెటింగ్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌, ఆన్‌స్ట్రూమెంటేషన్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2021 / 10:28 AM IST
    Follow us on

    BCPL Recruitment: బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మొత్తం 36 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ జనరల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీ జరగనుంది.

    BCPL Recruitment

    మార్కెటింగ్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌, ఆన్‌స్ట్రూమెంటేషన్‌ విభాగాలతో పాటు ఎఫ్‌అండ్‌ఏ, లా, హెచ్‌ఆర్‌, కెమికల్‌, మెకానికల్‌ విభాగాలలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏ లేదా డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ/ ఎంఎంఎస్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    Also Read: ఎస్బీఐలో 1226 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

    30 సంవత్సరాల నుంచి 51 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రాత పరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 24,900 రూపాయల నుంచి 73,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

    2021 సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం.

    Also Read: అనంతపురం జిల్లాలో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?