ఉబెర్ లో 250 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

ప్రముఖ రైడింగ్, ఫుడ్ డెలివరీ కంపెనీలలో ఒకటైన ఉబెర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 250 ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రముఖ సంస్థలలో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఇంజనీర్లకు ఈ ఉద్యోగ ప్రకటన వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో పని చేయాల్సి ఉంటుంది. దేశంలో ఇంజనీరింగ్ , ఉత్పత్తి కార్యకలాపాల పరిధిని పెంచుకోవాలని భావించి ఉబెర్ సంస్థ ఈ […]

Written By: Navya, Updated On : June 10, 2021 4:15 pm
Follow us on

ప్రముఖ రైడింగ్, ఫుడ్ డెలివరీ కంపెనీలలో ఒకటైన ఉబెర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 250 ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రముఖ సంస్థలలో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఇంజనీర్లకు ఈ ఉద్యోగ ప్రకటన వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో పని చేయాల్సి ఉంటుంది.

దేశంలో ఇంజనీరింగ్ , ఉత్పత్తి కార్యకలాపాల పరిధిని పెంచుకోవాలని భావించి ఉబెర్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఉద్యోగ నియామకాల ద్వారా ఉబెర్ అడ్టెక్, డేటా, భద్రత , ఫైనాన్స్ టెక్నాలజీ, రైడర్, డ్రైవర్ వృద్ధి, డెలివరీ, ఈట్స్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్‌ కప్లైన్స్‌, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొబిలిటీ, డెలివరీని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ఉబెర్ కృషి చేస్తోంది.

ఉబెర్ ప్రపంచ దేశాల్లోని 10,000కు పైగా నగరాలలో రవాణాలో కీలకంగా మారాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా తమ బృందాలు పని చేస్తారని ఉబెర్ సంస్థ చెబుతుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి సేవ చేసే ప్రయత్నాలలో భాగంగా నిపుణులైన ఇంజనీర్లను నియమించుకోనున్నామని ఉబెర్ సంస్థ వెల్లడించింది.

ఇంజనీరింగ్ డిగ్రీ, బీటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది.