https://oktelugu.com/

మయన్నార్ లో సైనిక విమానం కూలి 12 మంది మృతి

మయన్నార్ లో ఓ సైనిక విమానం కూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మండలే ప్రాంతంలో ఉన్న పియిన్ ఓ ల్విన్ పట్టణం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వాతావరణం సరిగా లేని కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ విమానంలో సైనికులతో పాటు బౌద్ద సన్యాసులు కూడా ఉన్నారు. ఓ బౌద్ద ఆరామంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వాళ్లు వెళ్తున్నట్లు గుర్తించారు. పియిన్ ఓ ల్విన్ నగరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 10, 2021 / 03:56 PM IST
    Follow us on

    మయన్నార్ లో ఓ సైనిక విమానం కూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మండలే ప్రాంతంలో ఉన్న పియిన్ ఓ ల్విన్ పట్టణం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వాతావరణం సరిగా లేని కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ విమానంలో సైనికులతో పాటు బౌద్ద సన్యాసులు కూడా ఉన్నారు. ఓ బౌద్ద ఆరామంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వాళ్లు వెళ్తున్నట్లు గుర్తించారు. పియిన్ ఓ ల్విన్ నగరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కు 300 మీటర్ల దూరంలో విమాన దుర్ఘటన జరిగింది. విమానంలో ఆరుగురు సిబ్బంది, 8 మంది ప్రమాణికులు ఉన్నారు. పైలట్ తో పాటు మరో ప్రయాణికులు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.