హైదరాబాద్ లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 140 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. బీఈ, బీటెక్ పాసైన వాళ్లు అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, సివిల్, ఐటీ, ఎలక్ట్రికల్ విభాగాలలో 40 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి.
బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులకు నెలకు 9,000 రూపాయలు స్టైఫండ్ గా లభించనుంది. టెక్నిషియన్ డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 30 ఉండగా సివిల్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జీ విభాగాలకు చెందిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 8,000 రూపాయలు స్టైఫండ్ గా లభించనుందని సమాచారం.
టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 70 ఉండగా ఐటీఐ పాసైన టర్నర్, మెషినిస్ట్ అప్రెంటీస్ లకు 8,050 రూపాయలు, వెల్డర్ అప్రెంటీస్ లకు 7,700 రూపాయలు లభించనుంది. మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ను బట్టి అభ్యర్థుల ఎంపిక ఎంపిక జరగనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://iifpt.edu.in వెబ్ సైట్ ద్వారా అప్రెంటీస్ జాబ్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
నాట్స్ పోర్టల్ ద్వారా అప్రెంటీస్ జాబ్స్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 10వ తేదీ చివరి తేదీగా ఉండగా మిధానీ పోర్టల్ ద్వారా నవంబర్ 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.