https://oktelugu.com/

Movies: థియేటర్లపై ఓటీటీ ప్రభావం ఎంత..? ఏదీ బెటర్..? ప్రేక్షకులు దేనిని కోరుకుంటున్నారు..?

Movies: మరోసారి కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తోన్న ఈ వైరస్ భారత్ లోనూ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలు మూతపడడంతో పాటు సినిమా థియేటర్లు మూసివేస్తున్నారు. ఇందులో భాగంగా రిలీజ్ కు రెడీ అయిన కొన్ని సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన ఆర్ఆర్ఆర్ లాంటి మూవీస్ థియేటర్లోనే విడుదల చేయాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2022 10:02 am
    Follow us on

    Movies: మరోసారి కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తోన్న ఈ వైరస్ భారత్ లోనూ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలు మూతపడడంతో పాటు సినిమా థియేటర్లు మూసివేస్తున్నారు. ఇందులో భాగంగా రిలీజ్ కు రెడీ అయిన కొన్ని సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన ఆర్ఆర్ఆర్ లాంటి మూవీస్ థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లో సాధ్యం కానందున దానిని వాయిదా వేసుకున్నారు. అయితే కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల చేశారు. కానీ ఓటీటీ ఫ్లాట్ ఫాం థియేటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందా..? అనే చర్చ సాగుతోంది. ఓటీటీతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని కొందరు అంటున్నారు. కానీ థియేటర్లను ఓటీటీ ఫ్లాట్ ఫా బీట్ చేయలేదన్నది ఎక్కువ మంది చేస్తున్న వాదన.

    కరోనా మొదటి వేవ్ కాస్త వెనక్కి తగ్గడంతో ‘ఉప్పెన’, ‘వకీల్ సాబ్’ లాంటి సినిమాలు థియేటర్లో విడుదలయ్యాయి. అయితే అప్పటికే ఓటీటీకి అడిక్ట్ అయిన ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా..? అన్న అనుమానం ఉండేది. కానీ ఊహించని విధంగా సినిమా చూసేవాళ్లు థియేటర్లలో సందడి చేశారు. దీంతో ఒక సినిమా థియేటర్లో చూస్తేనే మజా ఉంటుందని అంటున్నారు. దీంతో థియేటర్లను ఓటీటీ బీట్ చేయలేదని అంటున్నారు. 2021లో భారత దేశ వ్యాప్తంగా మొత్తం 400 సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. దీంతో ఓటీటీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని అన్నారు.

    కానీ సినిమాలను థియేటర్లో చూడాలన్న కాంక్ష ప్రేక్షకుల నుంచి ఇంకా పోలేదని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా హిందీ మూవీ ‘సూర్యవంశీ’ థియేటర్లో విడులయింది. ఈ సినిమా తొలి రోజే రూ.26.29 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.195 కోట్లు వసూలు చేసింది. అలాగే ఇంగ్లీష్ మూవీ ‘స్పైడర్ మాన్’ హిందీ వర్సెన్లో వచ్చిన ‘నో వేవ్’ డిసెంబర్ 18 న విడుదలయై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిచింది. ఇక తెలుగులో ‘పుష్ప’ ఇప్పటికే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తొలిరోజే రూ.52 కోట్లుు వసూలు చేసింది. అన్ని భాషల్లో కలిసి ‘పుష్ప’ రూ.179 కోట్లు వసూలు చేసింది.

    కరోనా సెకండ్ వేవ్ తరువాత విడులయిన సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టారు. దీంతో సినీ రంగానికి మంచిరోజులు వచ్చాయనుకున్నారు. అయితే కరోనా కారణంగా థియేటర్లో విడుదలకు అవకాశం లేని సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.అయితే వారు కొద్దిపాటి లాభం చూసుకొని ఇక్కడ విడుదల చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఓటీటీని ఆదరించడంతో పాటు థియేటర్లకు వస్తున్నారు.

    ఇదిలా ఉండగా ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా విడుదలయిన సినిమాలు సక్సెస్ బాట పట్టాయి. ‘దృశ్యం-2’, ‘జై భీం’, లాంటి సినిమాలు విజయవంతంగా రన్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలయినా ఆశించిన లాభాలు రాబట్టలేకపోయాయి. మే 13న విడుదలయిన సల్మాన్ ఖాన్ ‘రాధే’ నిరాశపరిచింది. అలాగే నవంబర్లో రిలీజ్ అయిన ‘సత్యమేవ జయతే’ సినిమా ప్లాప్ అయింది. దీంతో ప్రేక్షకులు ఎప్పటికీ రెండు వేదికలను ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రేక్షకులు ఓటీటీ వేదికలో సినిమాలు చూస్తేనే కొన్ని సినిమాలను చూడడానికి థియేటర్లకు వస్తున్నారు. మొత్తంగా ఓటీటీ ఫ్లాట్ ఫాం సినిమాలపై ప్రభావం లేనట్లే నని అర్థమవుతోంది.