మా’లో కుల కుంపట్లు.. ఈసారి ఎవరిది ఆధిపత్యం?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఇన్నాళ్లు ఈ కులాల కంపు అంతగా ఉండేది కాదు.. కానీ అగ్రహీరోల ఆధిపత్యం ఉండేది. మెగా స్టార్ చిరంజీవి మాట చెల్లుబాటు అయ్యేది. ఆయన సామరస్యంగా మా అధ్యక్షుడిని ఇతర కార్యవర్గానికి మద్దతు ఇచ్చి గెలిపించేవారు. అయితే ఎవ్వరు గెలిచినా కూడా పనులు కాకపోవడం.. మా భవనం అందని ద్రాక్షగా మిగిలిపోవడంతో ప్రతిసారి ఇదో ఎజెండాగా మారుతోంది. ఇప్పటికే మా భవనం కోసం అంటూ అమెరికాలో షోలు చేసి పోగేసిన డబ్బు […]

Written By: NARESH, Updated On : July 17, 2021 5:33 pm
Follow us on

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఇన్నాళ్లు ఈ కులాల కంపు అంతగా ఉండేది కాదు.. కానీ అగ్రహీరోల ఆధిపత్యం ఉండేది. మెగా స్టార్ చిరంజీవి మాట చెల్లుబాటు అయ్యేది. ఆయన సామరస్యంగా మా అధ్యక్షుడిని ఇతర కార్యవర్గానికి మద్దతు ఇచ్చి గెలిపించేవారు. అయితే ఎవ్వరు గెలిచినా కూడా పనులు కాకపోవడం.. మా భవనం అందని ద్రాక్షగా మిగిలిపోవడంతో ప్రతిసారి ఇదో ఎజెండాగా మారుతోంది.

ఇప్పటికే మా భవనం కోసం అంటూ అమెరికాలో షోలు చేసి పోగేసిన డబ్బు అంతా ఎటుపోయిందని బాలక్రిష్ణ లాంటి వాళ్లు విమర్శలు చేశారు. ఇక మిగతా వారు కూడా ఆ కోట్ల సంగతిని ఏం చేశారని పాత పాలకులను ప్రశ్నిస్తుంటారు.

అగ్రహీరోలను తీసుకొచ్చి అమెరికాలోని వివిధ సభలు, సమావేశాల్లో చూపెట్టి వసూలు చేసిన పైసలు ‘మా’ గత పాలకులకు మకిలి అంటించాయి. అందుకే ప్రతీసారి కూడా ‘మా’ ఎన్నికలు రాగానే ఈ ఇష్యూ రావడం.. కొత్తవారు తెరపైకి రావడం జరిగిపోతూనే ఉంటుంది.

తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. ఆయనకు పోటీగా మంచు విష్ణు, జీవిత, ఇంకో ఇద్దరు ముగ్గురు నిలబడుతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ కు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు పలకడంతోపాటు అన్న య్య చిరంజీవి మద్దతు ఉంటుందని ప్రకటించడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ వివాదంలో మరో అగ్రహీరో బాలయ్య ఎంట్రీ ఇచ్చి పెంటపెంట చేసేశాడు. కనీసం ‘మా’ భవనం కోసం ఎకరం సంపాదించుకోలేని మీరేం అధ్యక్షులు అంటూ దెప్పిపొడిచాడు. తన మద్దతు మంచు విష్ణుకు ప్రకటించి మా ‘భవన నిర్మాణంలో’ తాను సాయం చేస్తానన్నారు.

ఈ క్రమంలోనే కుల కుంపట్లు ‘మా’లో మరోసారి తెరపైకి వచ్చాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన మంచు విష్ణుకు.. అదే కమ్మ కులానికి చెందిన బాలయ్య సపోర్టు చేయడంతో ఇదో కులపోరాటంగా మారింది.

నిజానికి ఇండస్ట్రీ పెద్ద అయిన చిరంజీవి ఇలాంటి కులాల అభిమానానికి దూరంగా ఎవరైతే పనిచేస్తారో.. సమర్థులో వారికే సపోర్టు చేస్తారు. అందుకే ఆయన ప్రకాష్ రాజ్ కు మద్దతు పలికారు. కానీ ఈసారి బాలయ్య, మంచు విష్ణు వైపు ఉండడం.. మిగతా కమ్మ నిర్మాతలు, దర్శకులు కూడా అటు వైపు సాగితే ఇదో కుల కొట్లాటగా మారే అవకాశాలున్నాయి. ‘కమ్మ’ సినీ ప్రముఖులు ఒక్కటైతే ఇటు సైడు చిరంజీవి వర్గానికి గట్టిగా నిలబడుతారు. కానీ చిరు తలుచుకుంటే మా అధ్యక్ష పదవి గెలుపు ఈజీనే. మరి చిరు వర్గాన్ని కమ్మ బ్యాచ్ ఏ మేరకు అడ్డుకొని గెలుస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

ఇప్పటిదాకా ‘మా’లో కులాలను బట్టి విడిపోయిన సందర్భాలు లేవు. అగ్రహీరోలు అంతా కలిసి సామరస్యంగా ఎన్నుకునేవారు. కానీ నేడు ఈ కొత్త కోణం సినీ ఇండస్ట్రీలో వేర్పాటుకు దారితీసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది ఎటువైపు దారితీస్తుందనేది వేచిచూడాలి.