Media Vs Cine Celebrities : సాయిధరమ్ పై మీడియా అత్యుత్సాహం.. సినీ సెలబ్రెటీల ఫైర్.. తప్పు ఎవరిది?

Media Vs Cine Celebrities  : ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా’ మారింది తెలుగు మీడియా పరిస్థితి. మెగా హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయ్యింది మొదలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై మీడియా అత్యుత్సాహం చూసి సామాన్య ప్రజల నుంచి బాధిత సినీ ప్రముఖుల వరకూ అందరూ అసహ్యించుకునే పరిస్థితులు కనిపిసిస్తున్నాయి. ముఖ్యంగా న్యూస్ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ పరిస్థితి అయితే మరీ ఘోరం.. సాయిధరమ్ తేజ్ హెల్మెట్ నుంచి బైక్ వరకూ ధరించి మరీ […]

Written By: NARESH, Updated On : September 12, 2021 9:55 am
Follow us on

Media Vs Cine Celebrities  : ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా’ మారింది తెలుగు మీడియా పరిస్థితి. మెగా హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయ్యింది మొదలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై మీడియా అత్యుత్సాహం చూసి సామాన్య ప్రజల నుంచి బాధిత సినీ ప్రముఖుల వరకూ అందరూ అసహ్యించుకునే పరిస్థితులు కనిపిసిస్తున్నాయి. ముఖ్యంగా న్యూస్ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ పరిస్థితి అయితే మరీ ఘోరం.. సాయిధరమ్ తేజ్ హెల్మెట్ నుంచి బైక్ వరకూ ధరించి మరీ చూపిస్తూ రచ్చరచ్చ చేస్తున్న వైనం.. అభూత కల్పనలు, అసత్య వార్తలతో ఉన్నదానికి 10 రెట్లు ఎక్కువ చూపిస్తున్న వైనంపై సినీ సెలబ్రెటీలు మండిపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్, జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది నుంచి మొదలు కుంటే మంచు లక్ష్మీ, మంచు మనోజ్ వరకూ అందరూ కూడా మీడియా చేస్తున్న అతిని ప్రశ్నించారు. దర్శకుడు హరీష్ శంకర్ అయితే ఏకంగా టీవీ9 సీనియర్ రిపోర్టర్ ‘దొంతు రమేశ్’ను ట్విట్టర్ లో ప్రశ్నించి కడిగేసిన తీరు వైరల్ గా మారింది.

సినీ నటుడు సాయిధరమ్ తేజ్ శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ న్యూస్ ను అన్నీ న్యూస్ చానల్స్ ను ఇచ్చాయి. శనివారం మొత్తం ఈయన ప్రమాదానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా ప్రసారం చేశాయి. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు మీడియా అత్యుత్సాహంపై మండిపడుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని తప్పుడుగా ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అతను ఓవర్ స్పీడ్ వెళ్లడం వల్లే ప్రమాదానికి గురయ్యాడని చెప్పడంపై మండిపడుతున్నాయి. సీసీటీవీ వీడియోల్లో మామూలు స్పీడుతోనే ఉన్నా దాన్ని రచ్చ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు సినీ రంగానికి చెందిన వారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ముందుగా మీడియాపై సీనీ ప్రముఖుల విమర్శలను టీవీ9 సీనియర్ రిపోర్టర్ ‘దొంతు రమేశ్’ మండిపడ్డారు. ట్విట్టర్ లో ఓ ఘాటు పోస్టు పెట్టాడు. ‘మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. తప్పుడు కథలు కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించు కోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు అతి వేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురికావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు.’ అని దొంతు రమేశ్ ట్విట్టర్ లో సినీ ప్రముఖులపై మండిపడ్డారు.

దీనికి హరీష్ శంకర్ గట్టి సమాధానం ఇచ్చాడు. ‘‘మా సినిమాల్లో హింస అన్నారు మాకు సెన్సార్ ఉంది మేము వాళ్లకు answerable .. మీకేముంది మీరు దేనికి answerable కాస్త చెబుతారా ? రమేశ్ గారు నేను మీ వ్యవస్థని తప్పు పట్టట్లేదు వ్యవస్థని తప్పు దోవ పట్టించేవాళ్ల గురించి చెబుతున్నాను !! పరిస్థితిని అర్థం చేసుకోవండి.. అక్కడి సమస్యను గుర్తించండి’’ అని కౌంటర్ ఇచ్చారు.

ఇక మరో ట్వీట్ లోనూ హరీష్ నిప్పులు చెరిగారు.. ‘‘మరి సెన్సార్ మెంబర్ గా చేశా అంటున్నారు కదా దొంతు రమేశ్ గారు.. ఈ సినిమా లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం నిజం కాదు అని మేము వేస్తాం ; మీరూ న్యూస్ ముందు ఇదంతా నిజం కాదు కేవలం మా చానెల్ కల్పితం అని వేయండి మరి ! జనాలకి ఒక క్లారిటీ ఉంటది !! లేదంటే సినిమాలకు, న్యూస్ ను పోల్చకండి’ అంటూ హితవు పలికారు. ఇప్పుడు ఈ టీవీ9 జర్నలిస్టు, దర్శకుడు హరీష్ శంకర్ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా మీడియా తీరుపై ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. మెగా కుటుంబానికి వీర అభిమానిగా ఉన్న హైపర్ ఆది జబర్దస్త్ లో చేసే స్కిట్లలోనూ తన అభిమానాన్ని చాటుకుంటాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అంటే బాగా ఇష్టమున్న ఆదికి.. పవన్ కు ఇష్టమైన సాయి ధరమ్ తేజ్ పై వచ్చిన వార్తలను చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో ఆయన హైపర్ ఆది తెలుగు మీడియా అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

‘సాయిధరమ్ తేజ్ 300 నుంచి 400 స్పీడ్ తో వెళ్లాడా.. హైదరాబాద్ రోడ్లపై సూపర్ మాన్, బ్యాట్ మాన్ కూడా అంత స్పీడుతో వెళ్లలేడు. మీరు ఎక్కడ దొరికారురా మాకు.. మీ బతుకులు చెడ ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక హృదయ కాలేయం సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ కూడా తెలుగు మీడియా గురించి వ్యాఖ్యలు చేశారు. ‘కొన్ని ఛానెల్స్ తమ టీఆర్పీ రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నవి కాబట్టి నిజాలు బయటికి వచ్చాయి. లేకుంటే జీవితాంతం ఈ మచ్చను తొలగించుకునే సరికే సరిపోయేది.’ అని అన్నారు. అయితే వీరి ట్వీట్ల కు నెటిజన్లు సపోర్టు చేస్తున్నారు.

మరోవైపు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. ఓవర్ స్పీడ్ వెళ్తున్నాడని సాయిధరమ్ తేజ్ పై కేసు పెట్టడంపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ఓవర్ స్పీడ్ వెళ్తున్నాడని సాయిధరమ్ తేజ్ పై కేసు పెట్టారు. ఆ రోడ్డుపై మట్టిని ఎందుకు వేశారో చెప్పాలి. అలాంటి రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై కేసు పెట్టాలి’ అని అన్నారు.

ఇక కొన్ని ఛానెల్స్ బైక్ రేసింగ్ తో ఈ ప్రమాదం జరిగిందని ప్రసారం చేస్తున్నాయని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి రేటింగ్ పెంచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ‘థ్యాంక్స్ అన్నా.. నువ్వు బెడ్ మీద కూడా ఉండి కొన్ని ఛానెల్స్ కు పంట పండిస్తున్నావు. అయితే నువ్వు త్వరగా కోలుకోని రా’ అంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. మొత్తంగా శనివారం మొత్తం సాయిధరమ్ తేజ్ గురించే కొన్ని ఛానెల్స్ చర్చలు కూడా పెట్టాయి.

మరోవైపు మెగా ఫ్యాన్స్ సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. కొందరు గుళ్లల్లోకి వెళ్లి పూజలు చేస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే చిరంజీవి దంపతులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సాయిధరమ్ తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన కోలుకుంటున్నాడని చిరంజీవి ప్రకటించారు. అలాగు మరికొంతమంది సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి సాయి ధరమ్ తేజ్ ను పరామర్శిస్తున్నారు.