KCR TRS Politics: కేసీఆరే తగ్గాడు.. ఈటల తరువాత ఇంకెవరు లేనట్లే..? అంతా సేఫ్..!

KCR TRS Politics: టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ రాజేసిన అసంతృప్తి గళం ఇప్పుడు అందరు నేతలకు కొత్త ధైర్యాన్నిచ్చింది. అందరూ నేతలు సంధు దొరికితే..అవకాశం చిక్కితే ఈటల రాజేందర్ లా తిరగబడడానికి రెడీగా ఉన్నారట.. దీంతో టీఆర్ఎస్ లో రాజకీయం గుంభనంగా ఉంది. అది ఎప్పుడైనా పేలొచ్చని అంటున్నారు. అందుకే కేసీఆర్ సుదులాయించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈటల ఎపిసోడ్ తో కోల్పోయిన ప్రభావాన్ని.. పట్టును కాపాడుకోవాలంటే ఇప్పట్లో ఎవరిపైనా వేటు వేయకపోవడమే మంచిదని డిసైడ్ అయినట్టు […]

Written By: NARESH, Updated On : December 27, 2021 12:15 pm
Follow us on

KCR TRS Politics: టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ రాజేసిన అసంతృప్తి గళం ఇప్పుడు అందరు నేతలకు కొత్త ధైర్యాన్నిచ్చింది. అందరూ నేతలు సంధు దొరికితే..అవకాశం చిక్కితే ఈటల రాజేందర్ లా తిరగబడడానికి రెడీగా ఉన్నారట.. దీంతో టీఆర్ఎస్ లో రాజకీయం గుంభనంగా ఉంది. అది ఎప్పుడైనా పేలొచ్చని అంటున్నారు. అందుకే కేసీఆర్ సుదులాయించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈటల ఎపిసోడ్ తో కోల్పోయిన ప్రభావాన్ని.. పట్టును కాపాడుకోవాలంటే ఇప్పట్లో ఎవరిపైనా వేటు వేయకపోవడమే మంచిదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది..  హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఆరు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే కొన్ని చోట్ల టీఆర్ఎస్ గెలిచినా అనుకున్న మెజారిటీ రాలేదు. ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్ లాంటి జిల్లాల్లో టీఆర్ఎస్ కు రావాల్సిన ఓట్లు పక్కదారి పట్టాయి. ఖమ్మం జిల్లాలో తాతా మధుకు తక్కువ ఓట్లు రావడానికి ఓ నేత కారణం అని తెలుస్తోంది. ఆ నేత ఎవరో అందరికీ తెలుసు. కానీ ఆయనపై ప్రస్తుతం చర్యలు తీసుకునే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పార్టీపై ఎలాంటి ప్రభావం పడకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

KCR Etela-s

పార్టీతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి భర్త్ రఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి చాలా మంది నాయకుల్లో దడ పుట్టింది. కొందరు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్నా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అందరూ జాగ్రత్త పడ్డారు. కానీ ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో కొందరు నాయకుల్లో కాస్త ఆశ కలిగింది. కానీ టీఆర్ఎస్ ను వీడేందుకు ఇష్టపడలేదు. మరోవైపు ఈటల గెలుపు తరువాత ఆయనకు సంబంధించిన వారిని టీఆర్ఎస్ నుంచి తీసుకెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అదేం జరగలేదు.

కాగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా భానుప్రసాద్ రావు, ఎల్.రమణ పేర్లు ప్రతిపాదించారు. అయితే అప్పటికే తనకు ఈ అవకాశం ఇస్తారని ఆశతో ఉన్న కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే సమయంలో కొందరు టీఆర్ఎస్ లో ఉన్నవారే రవీందర్ సింగ్ కు మద్దతు ఇచ్చారని సమాచారం. దీంతో రవీందర్ సింగ్ వైపు ఉన్నవారిపై వేటు పడే అవకాశం ఉందని అన్నారు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందడంతో వారిపై ప్రస్తుతానికి చర్యలు తీసుకునే అవకాశం లేనట్లే తెలుస్తోంది.

ఇక ఖమ్మం జిల్లా నుంచి తాత మధు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తరుపున గెలుపొందారు. కానీ ఆయన రావాల్సిన ఓట్లు పక్కదారి పట్టాయి. అందుకు టీఆర్ఎస్లో ఉన్న నేతే కారణమని ప్రచారం జరిగింది. ఈ విషయంపై కొందరు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ వీరిపై కూడా ప్రస్తుతానికి వేటు వేసే ఆలోచలన లేనట్లేనని అధిష్టానం నుంచి వస్తున్న టాక్.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ నాయకులను సస్పెండ్ చేస్తే అసమ్మతి పెరుగుతోందని అధిష్టానం ఆలోచిస్తోంది. అలాంటి వారిని పట్టించుకోకుండా ఉంటేనే బెటరని కేసీఆర్ మదిలో ఉన్నట్లు సమాచారం. అయితే హ్యాట్రిక్ విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు టీఆర్ఎస్ కు చాలా గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఓ వైపు బీజేపీ.. మరోవైపు కాంగ్రెస్.. ఇంకో వైపు షర్మిల పార్టీలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యతిరేకత ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ సమయంలో పార్టీ నుంచి నాయకులను సస్పెండ్ చేస్తే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అందువల్ల ఈటల రాజేందర్ తరువాత మరే నాయకుడిపై వేటు వేసే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ పై లోలోపల వ్యతిరేకతతో ఉన్న నాయకులు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా పనిచేస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు కేసీఆర్ ఇలా వ్యతిరేకతతో ఉన్నవారిని ఏం చేయబోతున్నారోనని చర్చించుకుంటున్నారు.