Kaliyuga End: మనకు నాలుగు యుగాలు ఉన్నాయి. కృతా, త్రేతా, ద్వాపర, కలియుగాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కో యుగంలో పరిస్థితి ఒకోలా ఉంటుంది. ఇందులో ప్రస్తుతం నడిచేది ఆఖరి యుగం కలియుగం. అందుకే ఇన్ని అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. కలియుగం కూడా చివరి అంకానికి వస్తోంది. అందుకే మనుషులలో తేడాలు వస్తున్నాయి. కలియుగం అంతం కాగానే మళ్లీ కృతా యుగం మొదలవుతుంది. కృతా యుగాన్ని సత్య యుగమని కూడా పిలుస్తారు. ఈ యుగంలో అన్ని పుష్కలంగా ఉంటాయి. దేనికి లోటుండదు. మనుషుల ఆయుర్దాయం కూడా ఎక్కువే. ఒక్కో మనిషి లక్ష సంవత్సరాలు బతుకుతాడు. కృతా యుగం గురించి బ్రహ్మ, మార్కండేయ పురాణాల్లో వివరించబడింది.
కలియుగంలో ధర్మం నశిస్తుంది. అన్యాయాలు, అక్రమాలకు పెద్దపీట వేస్తారు. వావివరసలు లేకుండా పోతాయి. మనుషుల్లో జంతువుల సంస్కృతి పెరిగిపోతోంది. తల్లిదండ్రులను లెక్కచేయరు. భార్యాభర్తల బంధం కూడా ఉండదు. విచిత్రమైన వ్యాధులతో మనుషులు అంతమవుతారు. విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ప్రకృతి వైపరీత్యాలతో దేశాలే తుడిచిపెట్టుకుపోతాయి. దైవభక్తి అంతరిస్తుంది. ఎవరిని పట్టించుకోరు. దేనికి కూడా ప్రాధాన్యం ఇవ్వరు. సూర్యచంద్రులు కూడా గతితప్పుతారు. మనిషి ఆయుష్షు 16 సంవత్సరాలకు పడిపోతుంది. ఆ సమయంల షంబడ అనే నగరంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణుడికి కల్కి అవతారంలో మహావిష్ణువు పదో అవతారంగా జన్మించి కలిని అంతం చేయడంతో కలియుగం అంతమవుతుంది.
Also Read: Rajasingh- Lawyer Karuna Sagar: రాజాసింగ్ తరుఫున న్యాయవాది సాగర్ సంచలన వ్యాఖ్యలు
అప్పుడు సత్య యుగం మొదలవుతుంది. దీని కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు. సత్యయుగంలో పుణ్యాత్ములకు మాత్రమే చోటు ఉంటుంది. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. బతకడానికి లోటుండదు. ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. భగవన్నామ స్మరణలో ఎక్కువ కాలం గడుపుతారు. దేవతలు కూడా భూమి మీదకు ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటారు. కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణంలో జీవించడం వల్ల వారికి ఎలాంటి వ్యాధులు రావు. ఆయుర్దాయం కూడా లక్ష సంవత్సరాలు ఉంటుంది. వారి ఎత్తు పదకొండు అడుగులు ఉంటారు. దీంతో కృతా యుగంలో ప్రజలకు ఎన్నో మంచి వసతులు మనకు కనిపిస్తాయట.
కృతా యుగంలో వాన కాలమే ఉంటుంది. వర్షాలు కూడా అవసరమైనంత మేరకు పడతాయి. హింస, దొంగతనాలు, ఆకృత్యాలు ఉండవు. సత్యమే ప్రధానంగా ఉంటుంది. ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు. ఆయుధాలు వాడరు. డబ్బు మీద కూడా వ్యామోహం ఉండదు. సత్యం, ధర్మం, త్యాగాలకు విలువ ఇస్తారు. ఏది ఎవరికి అవసరమో దాన్ని తీసుకెళ్లి ఇతరులకు అవసరమైన వాటిని ఇస్తారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే మరణాలు ఉండవు. ఎవరి ఆయుర్దాయం ముగియగానే వారు స్వయంగా పుణ్యలోకాలకు వెళతారు.
అడవిలో జంతువులు కూడా మనుషుల మధ్యే తిరుగుతుంటాయి. సత్యయుగం అంటే సత్యానికే ప్రాధాన్యం. అందరు భగవంతుడితో మాట్లాడతారు. దానధర్మాలు చేస్తుంటారు. పుణ్యకార్యాలు ఆచరిస్తుంటారు. ఎదుటి వారికి సహాయం చేస్తూ వారికి అవసరమైన దానధర్మాలు చేస్తే సత్యయుగంలో జన్మించడం ఖాయమే. కానీ ఎంతమంది అలా ప్రవర్తిస్తున్నారు. స్వార్థమే పరమార్థంగా ముందుకు కదులుతున్నారు. అందుకే పాపభీతి పెరుగుతోంది. కృతా యుగంలో పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాల్సిందేనని చెబుతున్నారు.
Also Read:Kaleshwaram Project Debts: కేసీఆర్ కు బిగిస్తున్న ‘కాళేశ్వరం’ ఉచ్చు?
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Do you know when the kali yuga will end
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com