Minister KTR: యుద్ధం వేరు. యుద్ధ రీతి వేరు. కత్తి పట్టడం వేరు. కత్తికి పదును పెట్టడం వేరు. ఇవన్నీ ఒకేలా కనిపిస్తున్నా.. నాణేని కి ఉండే రెండు కోణాలు లాంటివి. ఈ రెండింటిని సమతూకంతో వాడ గలిగినప్పుడే రాజకీయ నాయకుడు పరిణతి చెందుతాడు. ప్రస్తుతం భావి సీఎంగా పేరు కెక్కిన కేటీఆర్ పై వాటిని వాడే ప్రయత్నంలో ఉన్నారు.
బలమైన నాయకుడిని తనే అని చెప్పుకునేందుకు
విస్తృతమైన పీఆర్ టీం, వంతపాడే మీడియా, పుష్కలంగా ఆర్థిక వనరులు, బలమైన సోషల్ మీడియా, సహకరించే వ్యాపారవేత్తలు, సిఎస్ నుంచి కలెక్టర్ల దాకా చెప్పినట్టు విని, చెప్పు చేతుల్లో ఉండే అధికారులు.. ఇంతకంటే ఒక ప్రజాప్రతినిధికి ఏం కావాలి? ప్రస్తుతం తెలంగాణలో ఈ సానుకూలత లన్ని ప్రస్తుతం సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనుభవిస్తున్నారు. అంతేకాదు భావి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పై వాటిని తన అస్త్రాలుగా వాడుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలపై గతంలోకంటే భిన్నంగా విమర్శల దాడి చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి మొదలుకొని అభివృద్ధి కార్యక్రమం దాకా దేన్ని వదిలిపెట్టడం లేదు.
Also Read: Presidential Elections- Jagan: రాష్ట్రపతి ఎన్నికలు.. జగన్ మద్దతు ఎవరికంటే?
పార్టీపై పట్టు
ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఓ నానుడి. దీన్ని అక్షరాల నిజం చేస్తున్నారు కేటీఆర్. మిగతా ప్రతిపక్ష పార్టీల కు ఇంటిపోరు ఉంది. కానీ ఎప్పుడైతే కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యారో అప్పుడే కేటీఆర్ పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మదిగా పార్టీ మొత్తంలో తన టీమ్‌ను నింపుకున్నారు. ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కూడా కేటీఆర్ అనుచరులే. 2023 లో కూడా టికెట్ వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ. ఎలాగూ ఇంటికి గెలిచారు కాబట్టి రచ్చ గెలిచేందుకు కేటీఆర్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
కేంద్రం పై విమర్శలు
ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సాక్షాత్తూ తన పర్యటనలో రైతులు చెప్పులు విసిరేస్తున్నారు. ఆ రైతులను అరెస్టు చేస్తే ప్రభుత్వం అభాసుపాలవుతోంది. సరిగ్గా దీన్ని గమనించిన కేటీఆర్ ఈ ఉపద్రవానికి అంతటికి కారణం కేంద్రం అనుసరిస్తున్న విధానాలే అని డైవర్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వీలు చిక్కినప్పుడల్లా ప్రధానమంత్రి మోడీ పై పరుషమైన విమర్శలు చేస్తున్నారు. ఈమధ్య తెలంగాణకు మోడీ వచ్చినప్పుడు తన అనుచరులతో “మీరు మాకు ఏమి ఇచ్చారు” అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఇక సోషల్ మీడియాలో అయితే కేటీఆర్ మామూలుగా విరుచుకు పడటం లేదు. అయితే ఇదే సమయంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కేటీఆర్ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవైపు కేంద్రాన్ని తిడుతూ, మరోవైపు మంత్రులను కలుస్తూ సొంత పార్టీ నేతల్ని డైలమాలో పడే స్తున్నారు. ఇదే అదనుగా బిజెపి నాయకులు కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి అని ఎద్దేవా చేస్తున్నారు. “వాస్తవానికి ప్రతి సమావేశంలోనూ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వడంలేదని ఆరోపించే కేటీఆర్.. మరి కేంద్ర మంత్రులను ఎందుకు కలుస్తున్నట్టు? రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం వాటా ఇంత వస్తుందని ఎందుకు లెక్క లేసినట్టు? ఇవన్నీ చూస్తుంటే కేంద్రంపై కావాలనే కేటీఆర్ బట్ట కాల్చి మీద వేస్తున్నారని” బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ పర్యవేక్షిస్తున్న శాఖల్లో పురపాలక శాఖ అత్యంత అవినీతిమయంగా ఉంది. రెవెన్యూ తర్వాత ఈ శాఖలోనే భారీగా అవినీతి జరుగుతోందని విజిలెన్స్ శాఖ నివేదిక ఇచ్చింది. పైగా కేటీఆర్ హైదరాబాదులో తన అనుచరులకు భారీగా భూములు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. పేరుకు పరిశ్రమలు ఏర్పాటు అయినప్పటికీ దాని వెనుక జరుగుతున్న తతంగం వేరే. ఈ విషయాలన్నీ కేంద్రం దగ్గర ఉండటంతో పైకి మోడీ ని తిడుతూ లోపల మంత్రులతో సయోధ్య కుదుర్చుకుంటున్నారని, అందులో భాగంగానే జయేష్ రంజన్ లేకుండానే స్వంతంగా ఢిల్లీ వెళుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
తరచూ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు?
ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ తరచు డిల్లీ వెళుతున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇటీవలే రాజీవ్ చంద్రశేఖర్ తో భేటీకి ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రి కేటీఆర్ మళ్లీ తాజాగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తో సమావేశమయ్యారు. హైదరాబాద్ మురుగు నీటి పారుదల, మాస్టర్ ప్లాన్, రోడ్ల కు సంబంధించి ఆర్థిక సహాయం అందించాలని, హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కోరారు. ఎస్టీ పి ప్రాజెక్టుల నిర్మాణానికి 8,684.54 కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందని, 62 ఎస్టీ పి ప్లాంట్లను నిర్మించడానికి రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది అని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు అమృత్ పథకం-2 కింద 2,850 కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే తాను కేంద్రం వద్దకు వెళ్లి నిధులు అడిగిన ఇవ్వడంలేదని ప్రజల్లో సానుభూతి పొందేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళుతున్నారనే విమర్శలు లేకపోలేదు. కాగా ప్రజల దృష్టి తనపై ఉండేలా చూసుకుని కేటీఆర్ ఢిల్లీ వెళుతున్నారనే వాదనలు ఉన్నాయి.
Also Read:RSS- Maharashtra Political Crisis: ఆర్ఎస్ఎస్ ఎక్కడ.. ‘మహా’ సంక్షోభంపై అందుకే స్పందించడం లేదా!?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Criticisms of the central government relations with the ministers ktr new strategy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com