Illegal affair: నేటి కాలంలో దంపతుల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండడం లేదు. రకరకాల కారణాల వల్ల దంపతులు తమ జీవిత భాగస్వాములను కాదనుకుని.. ఇతరులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారితో శారీరక సంబంధాలు పెట్టుకొని.. పెళ్లినాటి ప్రమాణాలకు పాతర వేస్తున్నారు. అంతేకాదు తమ వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్న భాగస్వాములను అంతం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఇటీవల పెరిగిపోయినప్పటికీ.. చాలామందిలో మార్పు రావడం లేదు.
వివాహేతర సంబంధం వల్ల ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని గంగోడనహల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. గంగోడనహల్లి లో ఓ నిర్మానుష్య ప్రదేశంలో మాద నాయనహళ్లి ప్రాంతానికి చెందిన పోలీసులు ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ శవం సగం కాలిపోయి ఉంది. చనిపోయిన ఆ వ్యక్తిని యాదగిరి ప్రాంతానికి చెందిన బవసరాజు (28) గా పోలీసులు గుర్తించారు.
బవసరాజుకు కొంతకాలం క్రితం వివాహం జరిగింది. అతని భార్య పేరు శరణమ్మ. మొదట్లో బవసరాజు శరణమా బాగానే ఉండేవారు. కానీ ఆ తర్వాత శరణమ్మ ప్రవర్తన మారిపోయింది. వీరభద్ర అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది. ఇది బవసరాజుకు తెలిసింది. దీంతో భార్యను అతడు నిలదీశాడు. పద్ధతిగా ఉంటానని అతడికి మాయమాటలు చెప్పింది. ఆ తర్వాత మళ్లీ వీరభద్ర తో సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది. ఈసారి మళ్లీ భార్య వ్యవహారం బవసరాజుకు తెలిసింది. దీంతో ఆమెను మరోసారి నిలదీశాడు. తమ సంబంధానికి అతడు అడ్డుగా ఉన్నాడని శరణమ్మ ప్రియుడు వీరభద్రతో చెప్పింది.
వీరభద్ర తన స్నేహితుడు అనిల్ కు ఈ విషయం మొత్తం చెప్పాడు. దీంతో వీరభద్ర, శరణమ్మ, అనిల్ ముగ్గురు కలిసి బవసరాజు ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బవసరాజును హత్య చేశారు. అతని మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి పెట్రోల్ పోసి కాలపెట్టారు. బవసరాజు మృతదేహం సగం మాత్రమే కాలిపోయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు విచారణ సాగించారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె అన్ని విషయాలు చెప్పింది. అనిల్, వీరభద్రను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్ కు తరలించారు.