Wife harassing Techie Husband: “ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రావాలని తెలియదా. ఎందుకు ఆలస్యమైంది.. ఊరికే ఫోన్ ఎందుకు చార్జింగ్ పెడుతున్నావ్.. శని, ఆదివారాలు ఇంట్లో ఖాళీగా ఉండే కంటే ఇంటి పనుల్లో నాకు సహాయం చేయవచ్చు కదా.. ఇవేవీ చేయవు. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్.. నన్ను ఆనందంగా ఉంచాలని తెలియదా.. నన్ను సుఖంగా ఉంచాలని తెలియదా.. అసలు నువ్వే మగాడివి” ఈ మాటలు అతనికి నిత్య కృత్యం. మాటలు మాత్రమే కాదు శారీరకంగా హింస.. మానసికంగా వేదన.. ఇవన్నీ కూడా అతడికి తీవ్ర ఇబ్బంది కలిగించాయి. ప్రతిరోజు తన భార్య తిట్టడం, కొట్టడం వంటివి పరిపాటిగా మారడంతో తట్టుకోలేక పోయాడు. చివరికి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పోలీసుల ఎంట్రీ తో ఈ స్టోరీ మొత్తం మారిపోయింది.
అతని పేరు విపిన్ గుప్తా. దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ఉంటాడు. ఇతడికి గతంలోని పెళ్లయింది. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మంచి జీతం.. హోదా.. లగ్జరీ హౌస్ అన్నీ ఉన్నాయి. కానీ అతని భార్య మాత్రం శుభలగ్నంలో ఆమని టైపు. ప్రతిదీ కావాలి. ఆమె అనుకున్నది కాళ్ల ముందు ఉండాలి. అందుకోసం అతడిని వేధించడం మొదలుపెట్టింది. తిట్టడం ప్రారంభించింది. ఇటీవల కాలం నుంచి కొట్టడం కూడా షురూ చేసింది. ప్రారంభంలో దీనిని పెద్దగా గుప్త పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో ఆమె ఆగడాలు పెరిగిపోయాయి. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు.
Also Read: హైదరాబాదులో మాటలకందని విషాదం.. కృష్ణాష్టమి వేడుకల్లో కనీ వినీ ఎరుగని ఘోరం!
ఈనెల 3న గుప్తా తన కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళాడు. తల నీ లాలు సమర్పించుకోవడానికి వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. ఇక అప్పటినుంచి అతని జాడ కనిపించలేదు. అతని కోసం వెతికిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేయగా అతడు నోయిడాలో ఉన్నట్టు తేలింది.. దీంతో పోలీసులు అక్కడి నుంచి అతన్ని బెంగళూరు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు గట్టిగా మందలించడంతో ఇకనుంచి పద్ధతిగా ఉంటానని అతని భార్య చెప్పింది.