Uttar Pradesh : అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అలీగడ్ ప్రాంతం. ఆ ప్రాంతంలో షకీర్ కు చాలా సంవత్సరాల క్రితం వివాహమైంది. అతడికి నలుగురు పిల్లలు..ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.. పిల్లలను కూడా స్థానికంగా ఉన్న పాఠశాలలో చదివిస్తున్నాడు. భార్య కూడా ఇంటి వద్దే ఉంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం షకీర్ భార్యకు ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఆ తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నిత్యం ఫోన్లోనే ఉండేది. గంటలు గంటలు ఫోన్లో మాట్లాడేది. ఇది షకీర్ కు మొదట్లో అంతగా ఇబ్బంది అనిపించేది కాదు. కాని చివరికి తనను పట్టించుకోవడం మానేసింది. కనీసం పనికి వెళ్లి ఇంటికి వస్తే అన్నం కూడా పెట్టడం విస్మరించింది. దీంతో అతడిలో అనుమానం బలపడింది. ఈ క్రమంలో అతడు ఆమె దగ్గర్నుంచి స్మార్ట్ ఫోన్ లాక్కున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటా మాటా అనుకున్నారు. చివరికి షకీర్ భార్య, నలుగురు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్ళింది.. వెంటనే వస్తుంది అని షకీర్ అనుకున్నాడు. అనే రోజులు గడిచిన ఆమె రాకపోయేసరికి.. అతడు ఒకసారిగా ఆందోళన చెందాడు. ఆమె గురించి తన అత్తింటి వారికి ఫోన్ చేస్తే వారు రాలేదని సమాధానం చెప్పారు. దీంతో అతడిలో అనుమానం మొదలైంది.
Also Read : ఒక్క రాంగ్ కాల్.. ఆమె జీవితాన్ని కష్టాల్లో నెట్టింది!
పోలీసులకు ఫిర్యాదు చేస్తే..
షకీర్ తన భార్య, పిల్లల ఆచూకీ కనిపెట్టాలని స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సిగ్నల్ ట్రాకింగ్ చేస్తే.. ఆమె వాడుతున్న ఫోన్ సిగ్నల్స్ తాజ్ మహల్ ఉన్నట్టు కనిపించాయి. దీంతో ఆ నెంబర్ కు పోలీసులు ఫోన్ చేస్తే.. ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా వారికి దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. షకీర్ భార్య వేరే వ్యక్తితో తాజ్ మహల్ వద్ద ఉంది. ఆమె నలుగురు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని షకీర్ కు పోలీసులు వెల్లడించారు.. అయితే ఆమె నిత్యం ఫోన్లో మాట్లాడే వ్యక్తి షకీర్ కు దగ్గరి బంధువు అని తెలిసింది. షకీర్ ఇంట్లో లేని సమయంలో అతడు వచ్చి వెళ్లేవాడని.. చాలా సేపు ఏకాంతంగా గడిపి వెళ్లేవాడు. ఒకసారి వారిద్దరిని అలా చూసి షకీర్ మందలించాడు. అయినప్పటికీ అతని భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరికి షకిర్ భార్య తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. నలుగురు పిల్లల్ని కూడా తన వెంటే తీసుకొని వెళ్ళిపోయింది. వారు తాజ్ మహల్ వద్ద ఉండగా.. పోలీసులు అక్కడికి వెళ్లారు. షకీర్ వద్దకు రావాలని ఆమెను కోరినప్పటికీ.. దానికి నిరాకరించింది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు వీడియో రికార్డ్ చేసి షకీర్ కు పంపించారు. అయితే ఇంత జరిగినప్పటికీ.. తన భార్యను తన వద్దకు పంపించాలని షకీర్ పోలీసులను కోరుతుండడం విశేషం.. మొత్తానికి ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే షకీర్ అభ్యర్థన మేరకు ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.
Also Read :వాళ్లకు తెలియదు కదా ప్రాణాలు పోతాయని.. కారులో డెత్ బెల్స్!