Night Shift Pressure: సాధారణంగా చాలా వరకు ఉద్యోగాలు 10 టు 5 వరకే సాగుతుంటాయి. కానీ కొన్ని అత్యవసర విభాగాలలో మాత్రం 24 గంటలు పని ఉంటూనే ఉంటుంది. ఆ విభాగాలు 365 రోజులపాటు పనిచేస్తూనే ఉండాలి. అత్యవసరవిభాగాలలో ప్రధానమైనది వైద్య విభాగం.. ఎందుకంటే ఒక మనిషికి తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మ ఇస్తారు.. పైగా వైద్య విభాగం లో పనిచేసేవారు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండాలి.. ఇలా ఒత్తిడి తట్టుకోలేక ఓ మేల్ నర్స్ దారుణానికి పాల్పడ్డాడు.
సాధారణంగా వైద్య విభాగంలో పనిచేసేవారు నైట్ షిఫ్ట్ లలో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు ఎంతో ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కంటిమీద కునుకు కూడా ఉండదు.. అలాంటప్పుడు వారిలో అసహనం పెరిగిపోతూ ఉంటుంది.. కాకపోతే దానిని వారు ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలి. లేకపోతే వారు కూడా పేషెంట్లుగా మారాల్సి ఉంటుంది.. కొన్ని సందర్భాలలో అత్యవసర కేసులు వస్తాయి.. వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.. ఆ సమయంలో కాస్త బుద్ధుడికి గురికావాల్సి ఉంటుంది.. అయితే ఇలాంటి చోట పని చేస్తున్న ఓ మేల్ నర్స్.. విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యాడు. ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు.
జర్మనీ దేశంలో వుయెర్సె లెన్ అనే ఓ ఆసుపత్రి ఉంది. ఈ ఆస్పత్రిలో ఒక మేల్ నర్స్ పనిచేస్తున్నాడు.. విధి నిర్వహణలో అతడు ఇటీవల కాలంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. ఇదే క్రమంలో అతని ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. దీంతో అతడు తట్టుకోలేక పది మంది పేషంట్లకు హైడోస్ ఇంజక్షన్లు ఇచ్చి వారిని అంతం చేశాడు. పని ఒత్తిడి తట్టుకోలేక తాను ఇలా చేసినట్టు పేర్కొన్నాడు. మరో 27 మందిపై హత్యాయత్నం కూడా చేశాడు.. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ కేసు విచారణ దశలో ఉంది. మరోవైపు నిల్స్ అనే మేల్ నర్స్ కూడా 85 మందిని అంతం చేశాడు. ఈ ఘటన జర్మనీ దేశంలో కలకలం సృష్టించగా.. తాజాగా జరిగిన దారుణం కూడా సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ఆస్పత్రులలో పనిచేసే పెళ్లి స్థాయికి సిబ్బంది మీద పని ఒత్తిడి తగ్గించాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.