Tragic Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చిత్తూరు మండలం పెంచర్ల గ్రామంలో పరువు హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామానికి చెందిన 21 సంవత్సరాల యువతి రుచితను ఆమె సోదరుడు 20 సంవత్సరాల వయసు ఉన్న తమ్ముడు రోహిత్ అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని సంచలనం సృష్టించింది. పోలీసుల విచారణలో తన సోదరి ఆమె ప్రియుడు తో ఫోన్లో మాట్లాడుతోందని.. అందువల్లే హత్య చేశారని ఒప్పుకున్న రోహిత్.. ఈ ఘటన వెనుక ఉన్న అనేక విషయాలను వెల్లడించాడు.
రుచిత డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవల ఐసెట్ రాసింది. అందులో ఉత్తమ ర్యాంకు రావడంతో ఎంబీఏ లో చేరెందుకు సిద్ధమవుతోంది. రుచిత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం బయటపడడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అవి పంచాయితీలకు దాడి తీశాయి. పెద్ద మనుషులు గట్టిగా మందలించడంతో మరోసారి మాట్లాడుకోబోమని వారిద్దరు చెప్పారు. దీంతో ఆ వివాదం అక్కడితో ఆగిపోయింది.
రుచిత ఐసెట్ రాసినప్పుడు ఆమె వెంట ప్రియుడు కూడా వెళ్ళాడు. ఆ విషయాన్ని రోహిత్ కు అతడి స్నేహితులు చెప్పారు. మనుషుల ముందు మాట్లాడుకోబోమని.. ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో ఫాలో అవబోమని చెప్పిన వారిద్దరు.. మాట తప్పడంతో రోహిత్ కు కోపం పెరిగిపోయింది. అయితే ఆ కోపాన్ని రోహిత్ తన మనసులోనే పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెబితే గొడవ అవుతుందని భావించి.. అప్పటినుంచి కోపంతో రగిలిపోతున్నాడు. ఆ విషయం అలా ఉండగానే రుచిత మళ్ళీ తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టింది. అనేక సందర్భాల్లో రోహిత్ కంటపడింది. దీంతో అతడు ఆమెను మందలించాడు.. ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రుచిత కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. సోమవారం కూడా అదే విధంగా పనులకు వెళ్లారు. వారు పనులకు వెళ్ళింది చూసిన రజిత ప్రియుడితో ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టింది. ఏదో పని మీద బయటకు వెళ్ళిన రోహిత్.. దానిని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి రోహిత్ వచ్చిన విషయాన్ని రుచిత గమనించలేదు.. ఆమె ఫోన్లో మాట్లాడుతున్న విషయాన్ని అతను గమనించాడు. ఈ వ్యవహారంపై ఆమెను మందలించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. తట్టుకోలేకపోయిన రోహిత్ రుచిత మెడకు విద్యుత్ వైర్ బిగించి.. గట్టిగా లాగాడు. ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.
Also Read: ఎద్దుల కోసం నదిలో దూకిన రైతు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
రుచిత అచేతనంగా పడిపోవడంతో రోహిత్ కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఈ విషయాన్ని అతడు కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రోహిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు.