https://oktelugu.com/

Viral News : ఆటో కోసం కక్కుర్తిపడి టాపాసు కింద కూర్చున్నాడు.. కట్ చేస్తే దారుణం జరిగింది.. వైరల్ వీడియో

దీపావళి రోజు దేశం మొత్తం ఆనందంగా వేడుకలు జరుపుకుంది. దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంది. కానీ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో జరిగిన ఓ సంఘటన మాత్రం ఓ కుటుంబంలో విషాదం నింపింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 5, 2024 / 01:35 PM IST

    Viral video

    Follow us on

    Viral News :  మద్యం మత్తులో చేసే పనులు దారుణంగా ఉంటాయి. ఆ మైకంలో విసురుకొనే ఛాలెంజ్ లు అనేకరకాల ప్రమాదాలకు కారణాలవుతాయి. అటువంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కోనకుంటె ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో 32 సంవత్సరాల శబరిష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి ఈ ప్రాంతంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. దీపావళి రోజు వారంతా విపరీతంగా మద్యం తాగారు. ఆ మైకంలో సరికొత్త సవాళ్లు విసురుకున్నారు. ” మేము ఒక పెద్ద టపాసు తీసుకొచ్చాం. అది చాలా శక్తివంతమైనది. భారీ శబ్దంతో పేలుతుంది. అయితే దానివల్ల పెద్దగా నష్టం ఉండదు. నువ్వు ఆ టపాసు మీద కూర్చుంటే చాలు.. మేము అంటిస్తాం. దానివల్ల నీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. నువ్వు ఈ చాలెంజ్ లో విజయం సాధిస్తే ఆటో కొనుగోలు చేసి ఇస్తామని” అతని స్నేహితులు చెప్పారు. దీంతో ఆశతో శబరిష్ ఆ ఛాలెంజ్ కు ఒప్పుకున్నాడు.

    శక్తివంతమైన బాంబు ధాటికి..

    ఆ బాంబు అత్యంత శక్తివంతమైనది. నాలుగు థౌజండ్ వాలా లకు సమానమైనది. ఆ బాంబుపై స్నేహితులు చెప్పినట్టుగానే శబరీష్ కూర్చున్నాడు. దీంతో అతడి స్నేహితులు ఆ బాంబు కు నిప్పు అంటించారు. అతడు ఆ బాంబుపై అలానే కూర్చుని ఉండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో అతడు కిందపడ్డాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే కన్నుమూశాడు. బాంబు భారీ గా పేలడంతో అతడి హృదయ స్పందన రేటు భారీగా పెరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ” కో నను కుంటె ప్రాంతంలో దారుణం జరిగింది. స్నేహితుల చాలెంజ్ లో పాల్గొన్న వ్యక్తి కన్నుమూశాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేశాం. సీసీ టీవీ లో దృశ్యాలు నమోదయ్యాయి. నిందితులపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటన లో పాలు పంచుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని” పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. శబరీశ్ మృతి చెందడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. శబరిష్ మృతి చెందిన నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శబరిష్ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే అతడు ఇంట్లో ఉండగా స్నేహితులు వచ్చారని.. కావాలనే బయటికి తీసుకెళ్లారని.. ఆ తర్వాత ఇంతటి దారుణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు పోలీసులతో చెప్పినట్టు కర్ణాటక మీడియాలో కథనాలు వస్తున్నాయి..