200 KMPH Car Drive Hyderabad: అది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. మనోడు కొత్త కారు కొన్నాడు.. ఏకంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. అదే కాదు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. లైకుల కోసం.. కామెంట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. చివరికి ఏం జరగాలో అది జరిగింది.
హైదరాబాద్ నగరానికి చెందిన యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తి వోక్స్ వ్యాగన్ కంపెనీకి సంబంధించిన కార్ కొనుగోలు చేశాడు. దానిని అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా డ్రైవ్ చేశాడు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. నడపడం మాత్రమే కాదు దానిని వీడియో రికార్డ్ చేసి.. దానిని కాస్త సోషల్ మీడియాలో వదిలాడు.. కామెంట్లు.. లైకులు వస్తాయని భావించి అతడు ఆ పని చేశాడు. కానీ తెలంగాణ పోలీసులు అతని మీద నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో అతని వ్యవహారం చూసి… ఘన సన్మానం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు మీద 200 కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడపడానికి అవకాశం లేదు. అతడు దూకుడుగా కారు నడపడంతో గుర్తించి అరెస్ట్ చేశారు.. అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్డు మీద వేగంతో ఎవరైనా వెళ్తే ఇదే పనిష్మెంట్ ఇస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇటీవల కాలంలో ప్రమాదాల పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టిగా దృష్టి పెట్టారు.. అంతేకాదు మితిమీరిన వేగంతో వెళ్లే వారిని స్పీడ్ గన్స్ సహాయంతో పట్టుకుంటున్నారు. ఆ తర్వాత వారికి తమదైన శైలిలో పనిష్మెంట్ ఇస్తున్నారు. యశ్వంత్ రెడ్డి, కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత.. మితిమీరిన వేగంతో వెళ్లడాన్ని తెలంగాణ పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
ఔటర్ రింగ్ రోడ్డు మీద అత్యంత బిజీగా ఉండే నార్సింగి పుప్పాలగూడ మధ్యలో అతడు విపరీతమైన వేగంతో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అందువల్లే అతడిని పట్టుకొని పనిష్మెంట్ ఇచ్చారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఎవరైనా ఈ స్థాయిలో వేగంతో వెళితే తమ పనిష్మెంట్ ఇలానే ఉంటుందని తెలంగాణ పోలీసులు చేతుల్లో చూపించారు.. పాపం యశ్వంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో లైకుల, కామెంట్ల పిచ్చి వల్ల చివరికి పోలీస్ స్టేషన్ పాలు కావాల్సి వచ్చింది.
200 kmph on Hyderabad #ORR for @instagram reels: @cyberabadpolice arrest #privateemployee for #dangerousstunt driving
A 32-year-old man from #Puppalaguda was arrested by #Narsingi Police after allegedly driving his newly purchased #VolkswagenVirtus at over 200 kmph… pic.twitter.com/2b3oCXKNC1
— NewsMeter (@NewsMeter_In) May 25, 2026
