Karimnagar: వివాహేతర సంబంధం ఉందని అనుమానం.. చివరికి ఈ భర్త ఏం చేశాడంటే..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, రోజా దంపతులకు 20 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు సంతానం. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్ వలస వచ్చారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 19, 2024 10:31 am

Karimnagar

Follow us on

Karimnagar: అనుమానం పాత రోగం అంటారు కదా.. ఈ భర్తది కూడా అలాంటి వ్యవహార శైలే. ఎప్పుడో 20 సంవత్సరాలకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు కూడా కలిగారు. వారు యుక్త వయసుకు వచ్చారు. ఇలాంటి సమయంలో మరింత అన్యోన్యంగా ఉండాల్సిన అతడు.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను చీటికిమాటికి వేధించడం మొదలుపెట్టాడు. ఈలో గానే మద్యానికి బానిసయ్యాడు. పని, పాటను గాలికి వదిలిపెట్టి ఆమెను కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. పిల్లల కోసం ఆమె కూడా ఇవన్నీ మౌనంగా భరించింది. ఎలాగూ భరిస్తోంది కదా అనే అలసుతో ఆ భర్త ఏం చేశాడంటే.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, రోజా దంపతులకు 20 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు సంతానం. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్ వలస వచ్చారు. సికింద్రాబాద్లోని తుకారామ్ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నారు. లక్ష్మణ్ ఇల్లు కట్టే మేస్త్రిగా పనిచేస్తున్నాడు. రోజా స్థానికంగా ఉన్న వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. వీరి ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు. అయితే రోజాకు వస్త్ర దుకాణంలో పనిచేసే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని లక్ష్మణ్ కు అనుమానం. ఇదే విషయంపై పలుమార్లు వారిద్దరి మధ్య పంచాయితీలు జరిగాయి. పెద్ద మనుషుల దాకా ఈ వ్యవహారం వెళ్ళింది. ఆ సమయంలో తన భార్యను ఇకపై వేధించనని.. బాగా చూసుకుంటానని లక్ష్మణ్ మాటిచ్చాడు. ఆ తర్వాత మళ్లీ షరా మామూలుగానే తన బుద్ధిని బయట పెట్టుకునేవాడు. ఇలా పలుమార్లు జరిగినప్పటికీ లక్ష్మణ్ వ్యవహార శైలి మారలేదు. ఈ క్రమంలో రోజా మానసికంగా వేదనకు గురయ్యేది.

అయితే ఈ క్రమంలో లక్ష్మణ్ మద్యానికి బానిసయ్యాడు. రోజాను తరచూ తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. ఇటీవల ఇవి శృతి మించాయి.. మంగళవారం మద్యం విపరీతంగా తాగిన లక్ష్మణ్.. ఇంటికి వచ్చి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఆమె కూడా అదే స్థాయిలో ప్రతిఘటించింది. సహనం కోల్పోయిన లక్ష్మణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రోజా పొత్తికడుపులో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో.. రోజా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు నమోదు చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.. నిందితుడు హత్యానంతరం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.