Homeక్రైమ్‌Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాతి టార్గెట్ ఎవరు..

Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాతి టార్గెట్ ఎవరు..

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన భార్య.. ఇద్దరు కుమారులను.. దారుణంగా అంతం చేసిన అతడు.. ఓ బాలికను.. ఆమె తల్లి.. నాయనమ్మను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించింది.

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకేసారి ఆరుగురు దారుణమైన హత్యకు గురికావడంతో కలకలం నెలకొంది. షాబాద్ మండల కేంద్రంలోని దైవాల గూడ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అతడి మీద ఫోక్సో కేసు పెట్టారనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు పెట్టిన బాలిక.. ఆమె తల్లి లక్ష్మి.. నాయనమ్మ రుక్కమ్మను కత్తితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. దైవాలగూడ ప్రాంతంలో తన భార్య సరితను.. ఇద్దరు పిల్లలను కత్తితో మెడ నరికి చంపేశాడు. ఆ తర్వాత షాబాద్ లో ఉన్న పి ఆర్ ఆర్ స్టేడియం సమీపంలో నివాసం ఉంటున్న ఆ బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను బలవంతంగా బయటికి లాక్కుని వచ్చాడు. ఆమె తల్లి.. నాయనమ్మ అడ్డగించే ప్రయత్నం చేస్తే.. కత్తితో వారిని అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఆ బాలికను దైవాల గూడలోని చెరువు సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతు కోసి అత్యంత క్రూరంగా చంపేశాడు.

ఆ బాలిక తండ్రి అరుణ్ కుమార్ కు ఫోన్ చేసిన అతడు.. మీ వాళ్ళందరినీ చంపేశాను.. తర్వాతి టార్గెట్ నువ్వే అంటూ హెచ్చరించాడు. ఈ దారుణాలకు పాల్పడడానికి ముందు అతడు ఒక నిర్జన ప్రదేశంలో ఏడు ఇటుకలను పేర్చాడు. ఆ ఇటుకలను ఏడు ప్రాణాలుగా అతడు భావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతడు ఆరుగురిని చంపడంతో.. ఏడవ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ఆ బాలిక తండ్రి అరుణ్ కుమార్ ఏడవ వ్యక్తి అయి ఉంటాడని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మే 16న అరుణ్ కుమార్ తన కుమార్తెను రాజ్ కుమార్ వేదించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అతని మీద పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడు అరెస్టు అయ్యాడు.. ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చాడు.. ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. రాజ్ కుమార్ సరిగా ఏడు సంవత్సరాల క్రితం సరితను వివాహం చేసుకున్నాడు. వారిద్దరిది ప్రేమ వివాహం.. ఇక్కడ జరిగిన తర్వాత రాజ్ కుమార్ ను తమకు అప్పగించాలని మృతుల బంధువులు ఆందోళన చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular