Property Dispute Crime: డబ్బు తాత్కాలికం. మనుషుల బంధాలు శాశ్వతం.. కానీ ఈ విషయం నేటి కాలంలో మరుగున పడిపోతోంది. మనుషులకు డబ్బు మాత్రమే అంతిమంగా మారిపోతోంది. డబ్బు కోసం దారుణాలు చేస్తున్నారు. ఘోరాలకు పాల్పడుతున్నారు. క్రూరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఫలితంగా ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. ఇవి మనుషుల మధ్య ఉన్న బంధాలను పలుచన చేస్తున్నాయి. డబ్బు కోసం మనుషులు ఎంతకు దిగజారి పోతున్నారో.. ఈ సంఘటన నిరూపిస్తోంది.
అతని పేరు శ్రీహరి.. బుచ్చిరెడ్డిపాలెంలో మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతడికి ఆస్తులు ఉన్నాయి. ఇతడి ఆస్తులను దక్కించుకోవడానికి సొంత బావమరిది దారుణానికి పాల్పడ్డాడు. కుక్కలను చంపే మందుతో ఇతడిని అంతం చేశాడు. శ్రీహరిని అంతం చేయడానికి అతని బావమరిదికి మరో ఇద్దరు వ్యక్తులు కూడా సహకరించారు.
శ్రీహరి తన బామ్మర్ది హరికృష్ణ మీద నమ్మకం పెట్టుకుని.. కోట రూపాయల విలువైన ఆస్తులను అతనికి రాసి ఇచ్చేశాడు. కొంత ఆప్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రీహరి సొంత ఇల్లు నిర్మించుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే గతంలో తాను హరికృష్ణకి ఇచ్చిన ఆస్తి.. డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఆస్తి ఇవ్వడానికి.. డబ్బు తిరిగి ఇవ్వడానికి హరికృష్ణకు మనసు ఒప్పలేదు. దీంతో ఎలాగైనా సరే శ్రీహరిని చంపాలని అనుకున్నాడు.
తన ప్రణాళికను అమలు చేసేందుకు ఇద్దరినీ ఎంచుకున్నాడు. గత నెల 15న దేవదర్శనం కోసం వెళ్దామని శ్రీహరితో చెప్పాడు హరికృష్ణ. పెంచలకోన ఆలయం బాగుంటుందని నమ్మబలికాడు. అతడిని కారులో తీసుకుపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత తిరిగి వస్తున్నప్పుడు.. చేజర్ల మండలం సమీపంలో హరికృష్ణ కారణం అకస్మాత్తుగా ఆపాడు. అప్పటికే రామతీర్థం.. గోలగమూడి ప్రాంతాలకు చెందిన రవీంద్ర.. యానాది అనే వ్యక్తులు.. అక్కడికి చేరుకున్నారు. శ్రీహరిని గట్టిగా పట్టుకున్నారు. దీంతో హరికృష్ణ.. వెంటనే తన చేతిలో ఉన్న ఇంజక్షన్ తీసి శ్రీహరికి వేశాడు. అవి కుక్కలను చంపడానికి ఉపయోగించేవి.
ఆ ఇంజక్షన్ వేయగానే శ్రీహరి వడ్డిన చనిపోయాడు. విషయం బయటకి తెలియకుండా శ్రీహరికి గుండెపోటు వచ్చిందని నమ్మ బలికారు. అనంతరం శ్రీహరి మృతదేహాన్ని ఆయన స్వగ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు తీసుకొచ్చారు. శ్రీహరి మృతదేహాన్ని చూసేందుకు తోటి ఉద్యోగులు వచ్చారు. అప్పుడు శ్రీహరి ఒంటిమీద గాయాలను చూశారు. అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. శ్రీహరి మృతదేహాన్ని వారి సంప్రదాయాల ప్రకారం పూడ్చివేయాలి. కానీ దానికి భిన్నంగా తగలబెట్టారు. ఇటీవల హరికృష్ణ శ్రీహరి పేరు మీద ఉన్న ఆస్తి కోసం పోరాటం మొదలు పెట్టాడు. దాన్ని తన పేరు మీద రాయాలని శ్రీహరి భార్య లావణ్య మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో లావణ్య ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రవీంద్ర.. యానాది పోలీసుల అదుపులో ఉన్నారు. హరికృష్ణ పరారీ లో ఉన్నాడు.
