Panchayat president Bharathi: కిక్ సినిమా చూశారా.. అందులో రవితేజ దొంగతనాలు చేస్తూ చిన్నారులను చదివిస్తుంటాడు. జెంటిల్మెన్ సినిమాలో కూడా అంతే.. అర్జున్ డబ్బులు దొంగతనం చేస్తూ భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఈ మాత్రమే కాదు తెలుగులో అనేక చిత్రపరిశ్రమలలో ఈ తరహా కథలతో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు చదవవే స్టోరీ మాత్రం పూర్తి డిఫరెంట్. ఈమె దొంగతనాలు చేస్తుంది. అలాగని నేర చరితరాలు కాదు. 15 సంవత్సరాలుగా సర్పంచ్ గా కొనసాగుతూ.. దొంగతనాలు చేస్తోంది. ఇది ఈ స్టోరీలో అసలు ట్విస్ట్.. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి.. అసలు స్టోరీలోకి వెళ్దాం పదండి.
అది తమిళనాడు రాష్ట్రం.. ఆమె పేరు భారతి.. తిరుపత్తూరు జిల్లా సరియం పట్టు అనే గ్రామానికి ఆమె సర్పంచ్ గా కొనసాగుతున్నారు. అధికార డిఎంకె పార్టీ లో కీలక నాయకురాలిగా కూడా ఉన్నారు. గడచిన 15 సంవత్సరాలుగా సరియం పట్టు గ్రామానికి సర్పంచ్ గా ఉన్నారు. అభివృద్ధి పనుల్లో కమిషన్ వసూలు చేయడం.. ఏదైనా పోలీస్ స్టేషన్లో పని పడితే డబ్బులు వసూలు చేయడం.. ప్రభుత్వ పథకాలలో అందిన కాడికి నొక్కేయడం ఈమె స్పెషాలిటీ. పైగా చెన్నై, ఇతర ప్రాంతాలలో భారీగా భవనాలు కూడా నిర్మిస్తోంది. స్థిరాస్తి ఫ్లాట్లను కూడా కొనుగోలు చేసింది. ఇవన్నీ చేయడానికి ఆమె మరొక పని కూడా చేస్తోంది. అదే దొంగతనం. ముందుగా చెప్పినట్టు ఈమె దొంగతనం చేయడంలో ఆరి తేరింది. తను ఒక మహిళ అయ్యుండి.. తోటి మహిళలను టార్గెట్ చేస్తూ.. వారి మెడ మీద ఉన్న బంగారు ఆభరణాలను తస్కరిస్తూ.. దందా మొదలు పెట్టింది..
Also Read: దేశమా, మతమా ఏది ముఖ్యం అంబేద్కర్ ఏం చెప్పాడు?
వాస్తవానికి ఈమె దొంగ అని తెలుసు. అయినప్పటికీ ఆ గ్రామ ప్రజలు ఈమెనే సర్పంచ్ గా ఎన్నుకున్నారు అంటే ఆమె పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తనకు పోటీగా మరొక వ్యక్తి లేకుండా.. ఒకవేళ ఉన్నా తనకు మాత్రమే సపోర్ట్ చేసే విధంగా చేసుకోవడం ఈమె స్పెషాలిటీ. అందువల్లే గడిచిన 15 సంవత్సరాలుగా గ్రామానికి సర్పంచ్ గా కొనసాగుతోంది. ఇగ ఇటీవల భారతి బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ మెడలో ఉన్న బంగారు చైన్ చోరీ చేసింది. బాధితురాలు బస్సులో ప్రయాణిస్తుండగా.. భారతి ఆమె పక్కన కూర్చొని మాటలు కలిపింది. ఆ తర్వాత మెడలో ఉన్న గోల్డ్ చైన్ చోరీ చేసింది. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు భారతిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను విచారణ నిమిత్తం జైలుకు తరలిస్తే.. తనకు దొంగతనం చేస్తే వచ్చే కిక్కు వేరని.. అందువల్లే అలా చేస్తున్నానని చెప్పింది. తాను దొంగతనం చేయడం బంధువులకు ఇష్టం లేకపోయినప్పటికీ.. మానుకోలేకపోతున్నానని భారతి చెప్పడం గమనార్హం.