Sreeleela Kartik Aaryan Together: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి శ్రీలీల(Sreeleela). కెరీర్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువే కానీ, అవకాశాలు మాత్రం క్యూలు కడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమాతో పాటు ఆమె బాలీవుడ్ లో మరో మూడు సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి అక్కడి యంగ్ హీరోలలో ఒకరైన కార్తీక్ ఆర్యన్ తో ప్రేమాయణం నడుపుతుందని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, అనేక సార్లు శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో కలిసి ప్రైవేట్ పార్టీలకు కూడా వెళ్లిందని బాలీవుడ్ మీడియా ఎప్పటి నుండో చెప్తున్నా మాట. అంతే కాదు శ్రీలీల తన తల్లి తో కలిసి కార్తీక్ ఆర్యన్ ఇంట్లో ఎన్నో సందర్భాల్లో కనిపించింది.
రీసెంట్ గానే వినాయక చవితి సందర్భంగా కార్తీక్ ఆర్యన్(Kartik Aryan) కుటుంబం కలిసి చేసుకుంటున్న గణపతి పూజలో శ్రీలీల తన తల్లి తో కలిసి కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇంటికి కాబోయే కోడళ్లతో కానీ, లేదా కొత్త కోడళ్లతో కానీ ఇలాంటి పూజా కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. అంటే దీని అర్థం శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్ చేస్తున్నారు అనేది రూమర్ కాదు, నిజమే అని స్పష్టంగా తెలుస్తుంది. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కే రోజు కూడా దగ్గర్లోనే ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. చూసేందుకు ఈ జంట చూడముచ్చటగా కూడా ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న ఒక లవ్ స్టోరీ లో ఈ జంట హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు.
Also Read: అల్లు అరవింద్ కి నోటీసులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇంటిని కూల్చేయబోతున్నారా?
ఈ సినిమాతో పాటు శ్రీలీల సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ఈ రెండు మాత్రమే కాకుండా మరో మూడు బాలీవుడ్ చిత్రాలకు కూడా ఆమె సంతకం చేసిందట. ఒక పక్క సౌత్ లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే, మరోపక్క బాలీవుడ్ లో కూడా చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది శ్రీలీల. మధ్యలో షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, ప్రముఖ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడం వంటివి చేస్తుంది. ఇంత తక్కువ సమయం లో ఈ రేంజ్ కి వెళ్లిన హీరోయిన్స్ మన టాలీవుడ్ లో లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.