Best Plants for Bedroom: చెట్లు ప్రగతికి మెట్లు అని అంటారు. కానీ పట్టణీకరణ, నగర అభివృద్ధి కారణంగా చాలా చెట్లను నరికి వేస్తున్నారు. అయితే చెట్లపై ఉన్న ప్రేమతో కొందరు ఇంట్లోనే మొక్కలను పెంచుకుంటున్నారు. సాధారణంగా కొన్ని మొక్కలను పెంచాలంటే వాటికి నిత్యం నీరు పోయాల్సి ఉంటుంది. అలాగే సూర్యరశ్మి ఉండాలి. కొన్ని మొక్కల ద్వారా దోమలు ఇంట్లో విజృంభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అపార్ట్మెంట్లలో ఉండే వారికి మొక్కలు పెంచుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో స్నేక్ ప్లాంట్ అనువుగా ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లోనే పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇవి పెంచుకోవడం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. అవేంటంటే?
కొంతమంది ఇంట్లో మొక్కలు పెంచుకునేవారు కేవలం డెకరేషన్ కోసమే అని అనుకుంటారు. మరి కొంతమంది మాత్రం ఇంట్లో స్వచ్ఛమైన వాతావరణం ఉండేలా మొక్కలను పెంచుకుంటారు. ఇలా భావించేవారు స్నేక్ ప్లాంట్ చేసుకోవడం ఎంతో మంచిదని అంటున్నారు. స్నేక్ ప్లాంట్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందువల్ల వీటివల్ల ప్రయోజనమే కానీ నష్టాలు లేవని అంటున్నారు. అచ్చం పాముల కనిపించే ఈ మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల వాతావరణ అన్ని శుద్ధి చేస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిస్తాయి. కొన్ని మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తాయి. అయితే ఇవి ఉదయం మాత్రమే ఇలా చేస్తాయి. కానీ స్నేక్ ప్లాంట్స్ మాత్రం రాత్రి కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తాయి.
స్నేక్ ప్లాంట్ ను పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వీటికి ప్రతిరోజు నీరు పోయాల్సిన అవసరం లేదు. వారం లేదా రెండు వారాలకు ఒకసారి నీరు పోసినా ఇవి ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. అంతేకాకుండా ఒక ఇంట్లో దీనిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం కలుగుతుందని కొందరు చెబుతారు. ఇది ఇంట్లో ఉండడంవల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతారు. కొన్ని మొక్కలకు సూర్యరష్మి కచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ స్నేక్ ప్లాంట్స్ కు సూర్యరశ్మి అవసరం లేదు. అలాగే వీటికి గాలి, వెలుతురు ఉండాల్సిన పని కూడా లేదు. ఇవి ఏ చోట ఉంచిన స్వచ్ఛంగానే పెరుగుతాయి.
Also Read: హనీమూన్ కు వెళ్లేవారికి శుభవార్త..
అయితే ఈ మొక్కల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వీటిని ఇంట్లో ఉండే జంతువులు తినడం వల్ల విష తుల్యంగా మారే అవకాశం ఉంది. అలాగే సరదా కోసం చిన్నపిల్లలు నోట్లో పెట్టుకున్నా.. అపాయమే అని అంటున్నారు. అంతేకాకుండా వీటికి తగిన మోతాదులో మాత్రమే నీరు అందించాలి. ఎక్కువగా నీరు పోయడం వల్ల తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులు మనుషులపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించాలని పర్యావరణ ప్రేమికులు తెలుపుతున్నారు.