Karnataka: నీరవ్ మోడీ, విజయ్ మాల్యా.. లాంటివారు కూడా వీరి మోసాలు చూస్తే భయపడిపోతారు. వాళ్లు బ్యాంకులకు టోకరా వేశారు కానీ.. నేరం బయటపడడంతో బయట దేశాలకు వెళ్ళిపోయారు. కానీ వీరు ఒక్కటే స్థలానికి సంబంధించి నకిలీ రికార్డులు సృష్టించి ఏకంగా 22 బ్యాంకులను మోసం చేశారు. కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నారు. పైగా తనకేమీ తెలియదన్నట్టుగా ఉన్నారు. ఎక్కడైతే మోసానికి పాల్పడ్డారో.. అక్కడే దర్జాగా కాలం వెల్లదిస్తున్నారు. బ్యాంకుల నుంచి మోసం చేయగా తీసుకున్న రుణాలతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో బనశంకరి పట్టణానికి సమీపంలో బేగురు అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో నాగేష్ భరద్వాజ్, అతడి భార్య సుమ, ఆమె సోదరీ వేద, ఆమె భర్త శేషగిరి, అతడి తమ్ముడు సతీష్, అతని స్నేహితుడు వేద నివాసం ఉంటున్నారు. వీరిలో భరద్వాజ్ కుటుంబానికి 2,100 అడుగుల స్థలం ఉంది. ఈ స్థలానికి బహిరంగ మార్కెట్లో పర్వాలేదనే స్థాయిలో విలువ ఉంది. అయితే ఈ స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భరద్వాజ్ ప్లాన్. అయితే ఈలోగా వేద అతడికి సరికొత్త ప్లాన్ చెప్పాడు. ఒరిజినల్ పోలిన రికార్డులు సృష్టించి బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చనే ఐడియా ఇచ్చాడు. ఇదేదో బాగుందనుకోని భరద్వాజ్ నకిలీ రికార్డు సృష్టించాడు. అలా బ్యాంకు అధికారులను సంప్రదించి.. నకిలీ రికార్డులు వారికి సమర్పించి రుణం తీసుకున్నాడు. ఇలా ఏకంగా కోటి 30 లక్షలు లోన్ గా పొందాడు. అయితే బ్యాంకుకు చెల్లింపులు చేయకుండా వంచనకు పాల్పడ్డాడు. దీనిపై బ్యాంకు అధికారులు జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసును జయనగర ఏసిపి నారాయణస్వామి ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి విచారించడం మొదలుపెట్టారు. పోలీసులు నాగేష్ భరద్వాజ్, అతని భార్య సుమ ను అరెస్టు చేయగా.. వారు మిగతా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పారు. దీంతో వారు మోసం చేసిన విధానం తెలుసుకొని పోలీసులే మూర్చ పోయారు.
బేగురు ప్రాంతంలోని ఆ 2,100 అడుగుల స్థలానికి సంబంధించి భరద్వాజ్ కుటుంబ సభ్యులు సర్వే నెంబర్లు మార్చారు. పొడవు, వెడల్పులో మార్పులు చేశారు. నకిలీ రికార్డులు సృష్టించారు.. ఇలా నాగేష్ భరద్వాజ్ తన కుటుంబ సభ్యుల పేరు మీద దానిని రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడు. ఈ విధంగా పలు జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో కుదువ పెట్టాడు. ఇలా 22 బ్యాంకులు నుంచి 10 కోట్ల వరకు రుణం తీసుకున్నాడు. ఆ తీసుకున్న డబ్బుతో అందరూ వాటాలు పంచుకొని లగ్జరీ లైఫ్ అనుభవించడం మొదలుపెట్టారు.. అయితే పోలీసుల విచారణలో తీసుకున్న రుణాల ద్వారా భరద్వాజ్ కుటుంబం భారీగా ఆస్తులు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అయితే వాటిని స్వాధీనం చేసుకోవాలని రుణాలు ఇచ్చిన బ్యాంకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సంఘటన కర్ణాటకలో సంచలనం సృష్టించింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Only one place loan from 22 banks
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com