spot_img
Homeక్రైమ్‌Actor Darshan: దర్శన్, పవిత్ర ఎపిసోడ్ లో దిమ్మ తిరిగిపోయే వాస్తవం..ఇది కదా ట్విస్ట్ అంటే..

Actor Darshan: దర్శన్, పవిత్ర ఎపిసోడ్ లో దిమ్మ తిరిగిపోయే వాస్తవం..ఇది కదా ట్విస్ట్ అంటే..

Actor Darshan: తన ప్రియురాలికి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని భావిస్తూ రేణుకా స్వామి అనే వ్యక్తిని కన్నడ నటుడు దర్శన్ హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇందులో స్వయంగా అతడు పాల్గొన్నాడని, రేణుకా స్వామిని తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దర్శన్ ను, ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కేసును ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నారు. రేణుకా స్వామి హత్యకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండగా.. దర్శన్, పవిత్రల మధ్య కూడా సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి.

రేణుకా స్వామి హత్య కేసులో సీనియర్ అధికారులు పవిత్రను దర్శన్ రెండో భార్యగా చెబుతున్నారు. వాస్తవానికి దర్శన్ పవిత్ర గౌడ్ ను పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. అదే విషయాన్ని దర్శన్ తరపు న్యాయవాది అనిల్ బాబు స్పష్టం చేశారు. దీంతో కన్నడ నాట తీవ్ర చర్చ జరుగుతోంది..” వారిద్దరూ తోటి నటులు మాత్రమే. ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. పెళ్లి చేసుకున్నట్టు నిరూపించే పత్రాలు ఏవీ లేవు. కొంతమంది మీడియా ప్రతినిధులు పవిత్రను దర్శన్ భార్యగా చూపిస్తున్నారు. దీనివల్ల ఆయన భార్య విజయలక్ష్మి తీవ్రంగా బాధపడుతున్నారు.. అవమానభారంతో ఆమె బయటికి కూడా వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఏకైక కుమారుడు తన స్నేహితుల ముందు ముఖం చూపించుకోలేకపోతున్నాడని” లాయర్ అనిల్ బాబు చెబుతున్నారు.

మరోవైపు రేణుకా స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ్ మేనేజర్ దేవరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రేణుకా స్వామిని హత్య చేసినట్టు భావిస్తున్న కారు షెడ్ ప్రాంతంలోకి దేవరాజ్ కూడా వెళ్లినట్టు పోలీసులు సిసి ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అనంతరం పోలీసులు దర్శన్, పవిత్ర గౌడ్ ఇళ్లకు వెళ్లి పంచనామా నిర్వహించారు. హత్యకు ముందు రేణుకాస్వామిని పవిత్ర చెప్పుతో కొట్టినట్టు నిర్ధారించుకున్నారు. ఆమె కొట్టిన చెప్పులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రేణుకా స్వామి ని హత్య చేసిన తర్వాత దర్శన్ పవిత్రను కొట్టాడని.. నీవల్లే ఇదంతా జరిగిందని అన్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పవిత్ర దర్శన్ తో ఉన్న బంధాన్ని పలుమార్లు బయటపెట్టింది. సోషల్ మీడియాలో వారిద్దరూ దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. పైగా తమ బంధానికి 10 సంవత్సరాలు నిండాయని పేర్కొంది. వీటిని కూడా పోలీసులు ఆధారాలుగా చూపుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper