Kozhikode crime news: కేరళ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు జాతీయవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల ఓ బస్సులో ఓ ప్రయాణికుడి మీద ఓ యువతి నిరాధారమైన నిందలు వేసింది. అతడు తనను అసభ్యంగా తాకాడంటూ ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవమాన భారంతో.. చేయని తప్పుకు నిందలు పడుతుండడంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ వ్యవహారం జాతీయ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిని మర్చిపోకముందే కేరళ రాష్ట్రంలో మరో ఘోరం చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రంలోని కొళికోడ్ ప్రాంతంలో ఓ యువతి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే దీనిని సహజ మరణం అని అందరూ అనుకున్నారు. పోలీసులకు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేయడంతో.. వారు రంగంలోకి దిగారు. ఆ తర్వాత దర్యాప్తు చేయడంతో కీలకమైన విషయాలు వెలుగుచూసాయి.
కొళికోడ్ ప్రాంతానికి చెందిన వైశాఖన్ కు ఓ యువతి తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఎక్కడ తన భార్య కు తెలిసిపోతుంది అనే భయంతో.. కుట్రకు శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా ఆ యువతితో ఈ బంధం కొనసాగించలేనని చెప్పాడు. నీతో గడపకుండా ఉండలేనని అన్నాడు. అనంతరం ఏడుపు నటించాడు. ఇద్దరం కలిసి చనిపోదామని ఆమెకు చెప్పాడు.
అనంతరం ఆమెను ఒక ప్రాంతానికి రప్పించాడు. ఇద్దరూ కుర్చీల మీద నిలబడ్డారు. మెడకు తాళ్లను చుట్టుకున్నారు. ముందుగా ఆమె కుర్చీని వైశాఖన్ తొలగించాడు. ఆమె మెడకు తాడు బిగిసుకున్న తర్వాత.. ఊపిరి ఆడకుండా చనిపోయిన తర్వాత.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ముందుగా ఆమె మృతిని సహజమరణంగా భావించారు. అయితే సిసి టివి ఫుటేజ్, పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించిన తర్వాత పోలీసులకు అనేక అనుమానాలు కలిగాయి. ఈ నేపథ్యంలో ఆమె ఫోన్ కాల్స్ పరిశీలించారు. విశాఖన్ ను విచారించారు. ఆ తర్వాత అతడు అసలు నిజాన్ని బయట పెట్టాడు. ఆ యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచే ఇతడు సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో అతనిపై ఫోక్సో తో పాటు ఇతర సెక్షన్ల ప్రకారం కేసులను పోలీసులు నమోదు చేశారు.