Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహజంగానే అనాగరిక ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి రాష్ట్రంలో ఇద్దరు కుమారులు కన్న తండ్రిని చంపారు. అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడిని ఇంటి ఆవరణలో పాతిపెట్టారు. ఈ ఘటన సరిగ్గా 30 సంవత్సరాల క్రితం జరిగింది. దీంతో మూడో కుమారుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం.. ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంత.. వారి దర్యాప్తులో ఈ ఘోరం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీస్ అధికారులు ఇంటి ఆవరణలో తవి చూడగా మనిషి ఆస్థిపంజరం లభించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ ప్రాంతానికి చెందిన బుధ్ సింగ్ 1994 నుంచి కనిపించడం లేదు. దీంతో అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు.. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇటీవల మూడవ కుమారుడు పంజాబీ సింగ్ తన తండ్రి ఆచూకీ కోసం కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిని తన ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి కలిసి చంపారని.. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుందని కలెక్టర్ తో విన్నవించాడు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో వారు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఆ ఇంట్లో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ అస్థి పంజరం లభించింది. ఆ తర్వాత దానికి పోస్టుమార్టం నిర్వహించారు.. డిఎన్ఏ పరీక్షల నిమిత్తం ప్రయోగ కేంద్రానికి పంపించారు.
ఆస్తి కోసమే ఆ పని చేశారా?!
బుధ్ సింగ్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడు. అతడికి నలుగురు కుమారులు.. గతంలో వారి మధ్య గొడవలు జరిగాయి. ఇటీవల కూడా వివాదాలు చోటుచేసుకున్నాయి. అయితే గతంలో బుధ్ సింగ్, అతని కుమారులకు వాగ్వాదం జరిగింది.. ఆ సమయంలో పంజాబీ సింగ్ 9 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు. ఆ సమయంలో అతడి ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి కలసి బుధ్ సింగ్ ను హతమార్చారు. ఆ తర్వాత అతడిని వారి ఇంట్లో పాతిపెట్టారు. ఇక అప్పటినుంచి తన తండ్రి ఆచూకీ గురించి చెప్పాలని పంజాబీ సింగ్ అడుగుతున్నప్పటికీ.. అతడి సోదరులు నిరాకరిస్తూ వస్తున్నారు.. బుధ్ సింగ్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఇన్నాళ్లకు పంజాబీ సింగ్ తన సోదరులపై అనుమానం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో.. ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో చెబుతున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి.. బుధ్ సింగ్ ఇంట్లో తవ్వకాలు జరపగా అసలు విషయం వెలుగు చూసింది.. ప్రయోగ శాలలో డీఎన్ఏ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా 30 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన ఇన్నాళ్లకు వెలుగులోకి రావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం నమోదయింది. అయితే ఆస్తికోసం బుధ్ సింగ్ ను అతడి కుమారులు చంపి ఉంటారని స్థానికులు అంటున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగు చూస్తుందని వారు వివరిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More