Madanapalle Lady Don: గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దందాలను దర్జాగా సాగించింది. అక్రమాలను జోరుగా నిర్వహించింది. ప్రత్యేకంగా ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని సామంత రాజ్యాన్ని కొనసాగించింది. ఇప్పుడు అధికారం లేదు, గత ప్రభుత్వం పెత్తనం లేదు. అయినప్పటికీ ఆమె ఆగడాలు ఆగడం లేదు. ఇదంతా కూడా మదనపల్లిలో ఓ లేడీ డాన్ సాగిస్తున్న వ్యవహారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. అధికారులు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కార్యాలయాలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇదంతా జరుగుతుండగానే మదనపల్లిలో ఓ ప్రతీపశక్తి పుట్టుకొచ్చింది. ఆమె తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఆ పార్టీ నాయకులతో రకరకాల వ్యవహారాలు కొనసాగించింది. అధికారం కోల్పోవడంతో వారిని పక్కన పెట్టింది. అంతేకాదు నాటు వైసీపీలో ఉన్న ఒక కీలక నాయకుడితో ఇప్పుడు ఆమె వ్యవహారాలు సాగిస్తోంది. ఒప్పందాలు కుదుర్చుకొని దందాలు మొదలు పెట్టింది.
గతంలో తాను ఆక్రమించిన భూములను బాధిత రైతులు ఇప్పుడు వెనక్కి తీసుకుంటుంటే అడ్డుకుంటున్నది. ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మదనపల్లి పట్టణంలో బెదిరింపులకు పాల్పడుతోంది. తమిళనాడు, ఇతర ప్రాంతాలలో నేరచరిత్ర ఉన్న వ్యక్తులను తనకు అనుచరులుగా మార్చుకొని బెదిరింపులకు పాల్పడుతుంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ పై ఈ లేడి డాన్ దాడి కూడా చేసింది. ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో మదనపల్లి ప్రజలు వణికి పోతున్నారు. ఇప్పటికే బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తమ బాధను చెప్పుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కొంతమందికి సంబంధించిన భూములను ఆ లేడీ డాన్ ఆక్రమించింది. ఆమెకు అప్పట్లో కో కీలక నాయకుడు సహకరించారు. ఆ భూముల్లో కొన్నింటిని ఆ కీలక నాయకుడికి, మరొక ప్రజా ప్రతినిధి భార్యకు ఈ లేడీ డాన్ వాటా కింద రాసి ఇచ్చింది. మదనపల్లి టౌన్ లోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ లేడీ డాన్ మీద ఏకంగా 18 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా పలు దశల్లో విచారణలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈమె ఏకంగా 100 కోట్లకు పైగా వెలుగున్న భూములను ఆక్రమించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె మీద 262/2023 కింద రౌండ్ కి కూడా నమోదు చేశారు.
ఇప్పుడు మదనపల్లి కేంద్రంగా కూటమి ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ లేడీ డాన్ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే జిల్లా కేంద్రం అవుతున్న నేపథ్యంలో ఇక్కడి భూములకు ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఆ లేడీ డాన్ మదనపల్లి పట్టణంలో అత్యంత ఖరీదైన భూములను ఫోర్జరీ పత్రాలు, అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్ లతో దక్కించుకుంది. అదే కాదు, వాటిని పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే ఆమె వ్యవహారం బయటపడిన నేపథ్యంలో బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిగిన నేపథ్యంలో అదంతా అక్రమం అని తేలింది. కోర్టు నాడు ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే కాదు ఆ లేడీ డాన్ మీద, భూములు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ నాసిర్ మీద కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.