Maruti Suzuki Celerio 2026: Maruti Suzuki కంపెనీకి చెందిన కార్లకు మార్కెట్లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి వెలువడే ఏ కారు అయినా కొనుగోలు చేయాలని మిడిల్ క్లాస్ నుంచి హైయ్యర్ క్లాస్ వరకు అన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతారు. కంపెనీ సైతం వినియోగదారుల అవసరాలను గుర్తిస్తూ.. అప్డేట్ చేస్తూ కొత్త వెహికల్స్ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వెలువడిన ఎన్నో కార్లకు ఆదరణ లభించింది. వాటిలో Celerio ఒకటి. అయితే ఈ కారు ఇప్పుడు నేటి వినియోగదారులకు అనుగుణంగా అప్డేట్ అయి మార్కెట్లోకి రాబోతుంది.. సెలెరియో 2026 పేరుతో వస్తున్న ఇందులో కొన్ని మార్పులు చేశారు. ఆ కారు ఎలా ఉందంటే?
సెలెరియో 2016 ఇంజన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో నెక్స్ట్ జెన్ K10C డ్యూయల్ జెట్ ఇంజన్ ను అమర్చారు. VVT పెట్రోల్ ఇంజన్ ను కలిగిన ఇది ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ ఉండడంతో అత్యధిక మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ పై 32 కిలోమీటర్ల మైలేజ్ వరకు వెళ్లొచ్చు.ఈ ఇంజన్ పై ఫైవ్ స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు.
ఈ కొత్త అప్డేట్ చేసిన కారులో 7 అంగుళాల స్మార్ట్ డిస్ప్లే టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటివి అమర్చారు. యూత్ కు బాగా నచ్చే విధంగా త్రీడీ ఆర్గానిక్ డిజైన్, డైనమిక్ కర్వ్ స్ టెంప్ట్ చేస్తుంది. లైట్ స్మూత్ స్టీరింగ్ ఉండడంతో నగరాల్లో వెళ్లే వారికి సాఫ్ట్ డ్రైవింగ్ చేయవచ్చు. అలాగే పార్కింగ్, మూవింగ్ ఈజీగా ఉండే విధంగా స్మూత్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండగా..NCAP నుంచి త్రీ స్టార్ రేటింగ్ను పొందింది. దీంతో పిల్లలతోపాట, పెద్దలకు రక్షణగా ఉండనుంది.
కొత్తగా కారు కొనాలని అనుకునే వారితో పాటు.. సింపుల్ డ్రైవింగ్ ఉండాలని అనుకునేవారు ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అంతేకాకుండా గతంలో వచ్చిన కారు కంటే ఇందులో అప్డేట్ ఫీచర్లు ఉండడంతో నేటి నేటి తరానికి బాగా నచ్చుతుందని చెబుతున్నారు. ఇక ఇందులో మెరుగైన క్యాబిన్ ఉండడంతో పాటు విశాలమైన సీటింగ్ అమర్చారు. అలాగే ఇంజన్ నిర్వహణ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. స్మూత్ గా ఉండే బాడీ లైన్, ఫ్రంటు బంపర్స్ ఆకర్షణీయంగా ఉండడంతో ఈ కారు లుక్ లో కూడా బెస్ట్ అని అంటున్నారు. తక్కువ అయిందన్న ఖర్చుతోపాటు లేటెస్ట్ అప్డేట్ కలిగిన కారు కొనాలని అనుకునే వారికి సెలెరియో 2026 ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.