Hitakshi case sensational details: సీరియల్స్ లో చూపించినట్టుగానే నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి.. ఒకరి పెత్తనాలు తట్టుకోలేక మరొకరు సీరియల్స్ లో చేసే దారుణాలు వాస్తవంలో కూడా కనిపిస్తున్నాయి. అలాంటి సంఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో విస్తు పోయే వాస్తవాలు కళ్ళకు కడుతున్నాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలో చిన్నారి హితాక్షి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయాలు వెలుగు చూశాయి. హితాక్షిని హతం చేసింది ఆమె పిన్ని మమత అని పోలీసుల నిర్ధారించారు. కోరుట్ల నగరంలోని ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన ఆకుల రాము, ఆకుల లక్ష్మణ్ అనే సోదరులకు నవీన, మమతలతో గతంలో వివాహం జరిగింది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కుదురు కావడం విశేషం. రాము, లక్ష్మణ్ తమ భార్యలతో ఓకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాము దంపతులకు వేదాంశ్, హితాచి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మణ్ దంపతులకు ఇద్దరు కూతుర్లు సంతానం.. అయితే సరిగ్గా నాలుగు నెలల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ లో మమత 18 లక్షలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. అలా బెట్టింగ్ ఎలా చేశావు అంటూ మండిపడ్డారు. ఇక ఇంట్లో నవీనకు కుటుంబ సభ్యులు ప్రాధాన్యం ఇవ్వడంతో మమత అంతులేని ద్వేషాన్ని పెంచుకుంది. అయితే ఆ ద్వేషం ఆమె మీద చూపించలేక.. నవ్వి నా కూతురు హితాక్ష మీద చూపించింది. ఏకంగా ఆమెను చంపాలని నిర్ణయించుకుంది.
Also Read: మహిళలకు రేవంత్ రెడ్డి పెద్ద హామీ.. నెరవేరుతుందా?
గడిచిన శనివారం హితాక్షి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చింది. ఆ తర్వాత అదే రోజు ఆ కాలనీలో పెద్దపులుల వేషధారణలతో కొంతమంది వచ్చారు. వారిని చూసేందుకు మమత వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ తన వెంట కూరగాయలు కోసే కత్తి.. చెట్ల కొమ్మలు కత్తిరించే కట్టర్ తీసుకెళ్లింది. పెద్దపులుల వేషధారణ ను చూసేందుకు హితాక్షి కూడా వెళ్ళింది. హితాక్షిని మాటలతో మభ్యపెట్టిన మమత.. తన వెంట తీసుకెళ్లింది. సమీపంలో ఓ ఇంటికి గేటు, బాత్రూం డోర్ లేకపోవడంతో హితాక్షిని అందులోకి తీసుకెళ్లింది. బాత్రూం లో పడేసి.. కత్తితో గొంతు కోసింది. కట్టర్ తో మెడ కట్ చేసింది. చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి దుస్తులు మార్చుకొని.. అందరితో కలిసి హితాక్షిని వెతికింది మమత. అయితే హితాక్షి మృతదేహం దొరికిన తర్వాత ఆసుపత్రిలో మమత అందరితోపాటు విలపించింది.
Also Read: భయపడ్డ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
పోలీసుల విచారణలో వాస్తవాలు తెలియడంతో.. మమతను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్య ఆమె ఒక్కతే చేసిందా? ఇంకా ఎవరైనా సహకరించారా? ఇంతటి దారుణానికి ఆమె ఒడిగట్టడానికి కారణం ఏంటి? నవీనకు ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణం మాత్రమేనా? ఇంకా ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
చిన్నారి హత్యకేసులో బిగ్ ట్విస్ట్
చిన్నారిని చంపింది స్వయానా పిన్ని. తోటికోడలి పెత్తనం తట్టుకోలేకే చిన్నారిని తన పిన్ని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి. ఆకుల రాము-నవీన దంపతుల కుమార్తె హితిక్ష. ఎప్పటి మాదిరిగా శనివారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి… https://t.co/28q4noJvBE pic.twitter.com/GxIVogzed0
— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2025