Indore Crime News: ప్రేమలో ఉన్నంతవరకు ప్రేమికులకు లోకం గురించి తెలియదు. ఆ ప్రేమ నుంచి బయటపడ్డ తర్వాత లోకం అంటే ఏంటో తెలుస్తుంది. అంతేకాదు ఇన్నాళ్లపాటు తమ ప్రేమించిన వ్యక్తుల అసలు రంగు బయటపడుతుంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కారాలు నూరడం.. కోపాలు పెంచుకోవడం పరిపాటిగా మారుతుంది. ఆ తర్వాత ఏదో ఒక దారుణానికి అది దారి తీస్తుంది. అటువంటి సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతంలో జరిగింది.
ఇండోర్ ప్రాంతంలో రాజేంద్ర అనే యువకుడు ఉన్నాడు. ఇతడు గతంలో ఒక అమ్మాయితో ప్రేమలో ఉండేవాడు. ఆ అమ్మాయి కూడా ఇతడిని పిచ్చిగా ప్రేమించేది. మొదట్లో బాగానే ఉండేది. ఆ తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. ఇద్దరు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి మరొక అబ్బాయి ప్రేమలో పడింది. వారిద్దరు కలిసి ఉంటుంటే రాజేంద్ర తట్టుకోలేకపోయాడు. పీకలదాకా కోపం పెంచుకున్నాడు. ఆ అమ్మాయి పై ఆ కారణంగా దూషణల పర్వం కొనసాగించేవాడు. అడ్డగోలుగా మాట్లాడేవాడు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వ్యవహరించేవాడు. చివరికి ఒకరోజు ఆమె ఊహించని దారుణానికి పాల్పడ్డాడు.
Also Read: ప్రపంచ ప్రఖ్యాత కార్ల సరసన మారుతీ సుజుకీ
వాస్తవానికి రాజేంద్ర ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. తనను తిరిగి ప్రేమించమని కోరుతున్నాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదు. పైగా అతడిని నిరాకరిస్తూ వస్తోంది. అతడు అంటేనే మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మీద కోపం పెంచుకున్న రాజేంద్ర ఒక ప్రణాళిక రూపొందించాడు. ఆమెను ఏమైనా చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. అంతే ఇండోర్ లో తన ఇంటి పరిసర ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆ అమ్మాయిని బైక్ మీద వెళ్తున్న రాజేంద్ర ఒక్కసారిగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.
View this post on Instagram