Chris Maharaj: ఉన్నత చదువులు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఏటా భారతీయులు వేల మంది విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో చాలా మందికి అక్కడి చట్టాలపై అవగాహన ఉండదు. భారత దేశంలో చట్ట ప్రకారం ఒప్పు అనుకున్నది.. అక్కడ తప్పు అవుతుంది. మన దేశంలో నేరంగా భావించే వాటికి విదేశాల్లో చట్టబద్ధత ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగుల్లో చాలా మందికి అక్కడి చట్టాలపై అవగాహన ఉండడం లేదు. దీంతో చాలా మంది తెలిసో, తెలియకో నేరం చేస్తున్నారు. దీంతో అక్కడి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తున్నారు. అక్కడ వాదించేవారు లేకపోవడం, ఇందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేని కారణంగా శిక్షకు గురవుతున్నారు. ఏళ్లకు ఏళ్లు జైళ్లలో మగ్గుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఎక్కువగా అక్కడ జైలుకు వెళ్తున్నారు. ఇప్పటికీ చాలా మంది జైళ్లలో ఉన్నారు. ఇలాగే భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు క్రిస్ మహారాజ్(85) చేయని నేరానికి జైలుకు వెళ్లాడు. దాదాపు 38 ఏళ్లు జైల్లోనే మగ్గాడు. చివరకు జైలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మరణించాడు. 1986లో ఓ హత్య కేసులో అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. అతనికి మరణ శిక్ష విధించింది. అయిత 2002లో దీనిని జీవితఖైదుగా మార్చింది. 2019లో నిర్దోషిగా ప్రకటించబడినప్పటికీ కోర్టు తీర్పు కారణంగా మహారాజ్ జైలులోనే ఉన్నాడు. నేరానికి 38 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత ఫ్లోరిడా స్టేట్ జైలులోని ఆసుపత్రిలో మరణించాడు.
ఏం జరిగిందంటే..
డెరిక్, డువాన్ మూ యంగ్ 1986లో హత్యకు గురయ్యారు. ఈ కేసుతో మహారాజ్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ అనుకోకుండా హత్య క ఏసులో ఇరుక్కున్నాడు. అరెస్టుకు ముందు మహారాజ్ ఇంగ్లాండ్‌లో సంపన్న వ్యాపారవేత్త. రేసు గుర్రాలు, గోల్ఫ్ రాయిస్‌లు కలిగి ఉన్నాడు. ట్రినిడాడ్‌కు చెందిన మహారాజ్ 1960 నుంచి ఇంగ్లండ్‌లో నివసిస్తున్నాడు. రిటైర్‌మెంట్ హోమ్ కొనడానికి తన భార్యతో కలిసి విహారయాత్రకు బయల్దేరాడు. ఈ క్రమంలో ఫ్లోరిడాలో హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టు విచారణలో దోషిగా నిర్ధారించబడ్డాడు. ఈ సమయంలో అతని జీవితం నాటకీయంగా మారిపోయింది. అతను నిర్దోషి అని అతని భార్య సాక్ష్యం యొక్క వాదనలు ఉన్నప్పటికీ, అతనికి మరణశిక్ష విధించబడింది. అతని శిక్ష మార్చబడటానికి ముందు మరణశిక్షలో 17 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. 2002లో అతని మరణ శిక్షణు జీవితఖైదుగా మార్చరు. ఇక 2019లో మహారాజ్ నిర్దోషిగా నిరూపితమయ్యాడు. కానీ జైల్లోనే ఉండిపోయాడు.
సంతాపం తెలిపిన భార్య..
అమెరికా జైలు ఆస్పత్రిలో భర్త మరణ వార్త తెలుసుకున్న మహారాజ్ భార్య మారితా మహరాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.‘నేను 1976లో క్రిస్‌కి వాగ్దానం చేశాను. చనిపోయేంత వరకు మనం కలిసి ఉంటామని, అతను భయంకరమైన ప్రదేశంలో ఒంటరిగా మరణించినందుకు నేను కుంగిపోయాను‘ అని ఆమె పేర్కొన్నారు. అంత్యక్రియల నిర్వహణ కోసం క్రిస్ మహారాజ్ మృతదేహాన్ని యూకేకు పంపించాలని కోరింది. అతను చివరిగా ఉండాలనుకునే ప్రదేశం అతనిపై తప్పుడు అభియోగాలు మోపబడిందని పేర్కొంది. అప్పుడు నేను అతని పేరును క్లియర్ చేయడానికి దేవుడు అనుమతించే మిగిలిన సమయాన్ని నేను వెచ్చిస్తాను, కాబట్టి నేను నేను అతని కోసం నా వంతు కృషి చేశాను అనే స్పష్టమైన మనస్సాక్షితో స్వర్గంలో అతన్ని కలవడానికి వెళ్ళవచ్చు అని తెలిపింది. ఇదిలా ఉంటే క్రిస్ మహారాజ్ మరణాన్ని క్లైవ్ స్టాఫోర్డ్ స్మిత్, మహారాజ్ ప్రో–బోనో అటార్నీ, మానవ హక్కుల సంస్థ రిప్రైవ్ వ్యవస్థాపకుడు ధ్రువీకరించాడు. ఆగస్టు 5న మరణించినట్లు పేర్కొన్నాడు. 38 సంవత్సరాలుగా తన భర్తకు అండగా నిలిచినందుకు మారితాను ప్రత్యేకమైన జీవిత భాగస్వామిగా అభివర్ణించాడు.