IBomma Ravi Case Twist: పోలీసుల అదుపులో ఉన్నానని భయం లేదు. తనను విచారిస్తున్నారని బెదురు లేదు. సూటిగా చూస్తున్నాడు. ఏ ప్రశ్నకైనా సరే ఒకేసారి సమాధానం ఇస్తున్నాడు. మరోసారి సమాధానం లో స్పష్టత కోసం పోలీసులు ప్రశ్న అడిగితే కోపంతో చూస్తున్నాడు. అంతేకాదు, తన పాత మిత్రులను గుర్తుకు లేనట్టు నాటకం ఆడుతున్నాడు. ఇవీ ఐ బొమ్మ రవిని పోలీసులు విచారిస్తుండగా.. తెలుస్తున్న విషయాలు..
గత కొద్ది రోజులుగా ఐ బొమ్మ రవిని తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో అతడి వద్ద నుంచి నిజాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఐ బొమ్మ రవి అపరిచితుడి మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు. క్షణక్షణం పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అడిగిన ప్రశ్నకు ఒకే ఒకసారి సమాధానం చెబుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అడిగితే పోలీసులకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నాడు. దీంతో అతడితో తట్టుకోలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
వాస్తవానికి ఐ బొమ్మ రవి తనపై సినీ ప్రముఖులు ఫిర్యాదు చేస్తే.. వారిని ఇరికించడానికి ప్రణాళిక రూపొందించాడు. అంతేకాదు డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. 2007 లోనే తన క్రిమినల్ ఆలోచనను తోటి స్నేహితులతో పంచుకున్నాడు. ఆ తర్వాత తన కుట్రకు వారిని బలి చేశాడు. తన నేరాలకు వారిని వాడుకున్నాడు. రవి ఐ బొమ్మ, ఇతర సైట్లలో పైరసీ సినిమాలను అందుబాటులో వచ్చేవాడు. తద్వారా 2019 నుంచి 2023 వరకు ప్రకటనల రూపంలో అవిపృతంగా ఆదాయం సంపాదించాడు. ఈ విభాగంలోకి అనేక సైట్లు రావడంతో.. అతడికి అంతగా ఆదాయం రాలేదు. దీంతో సినీ ప్రముఖులు ఫిర్యాదు చేశారు. దీంతో అతడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. కాల పరిమితి ముగిసిన ఐ బొమ్మ డూప్లికేట్ పోర్టల్ వేదికగా పోలీసులకు ప్రశ్నలు వేశాడు. సినీ ప్రముఖులు ఇదంతా నడిపిస్తున్నారని ఉల్టా దబాయింపు మొదలుపెట్టాడు.
విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో అతడు ఐ బొమ్మ, బప్పం అనే టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ కంపెనీలకు మెయిల్స్ పంపించారు. ఈ క్రమంలో రవి చాలా తెలివిగా ఆ డొమైన్ల కు సర్వీస్ అందిస్తున్నట్టు.. పైరసీ సినిమాలు అందులో లేవని సమాధానం ఇచ్చాడు. అయితే పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు జరిపి వీఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ ఫోన్ నెంబర్ ఆధారంగా రవి విదేశాలలో ఉండి.. ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్టు గుర్తించారు.
ఐ బొమ్మ వెబ్సైటుకు పోస్టర్ డిజైన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ కు మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్ కు రవి మెసేజ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. తాను ఫ్యాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చానని రవి ఆ సందేశంలో పేర్కొన్నాడు. ఆ సందేశం ప్రకారం పోలీసులు కూకట్పల్లి ప్రాంతం వెళ్లి.. రవిని అరెస్ట్ చేశారు.
రవిది మొదటి నుంచి కూడా క్రిమినల్ బ్రెయిన్. అందువల్లే అతడు డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కాడు. 2007లో మహారాష్ట్రలో ఫోర్జరీ సంతకాలు.. నకిలీ పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. ఆ తర్వాత పాన్ కార్డు కూడా సంపాదించాడు. అయితే ఆ కార్డులలో ఉన్న సమాచారం ఆధారంగా పోలీసులు కాళీ ప్రసాద్, అంజయ్య, ప్రహ్లాద్ అనే వ్యక్తులను గుర్తించారు.
రవి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇటీవల పోలీసులు ప్రహ్లాద్ అనే వ్యక్తిని విచారణ జరుగుతున్న ప్రాంతానికి రప్పించారు. ఈ సమయంలో ప్రహ్లాద్ ను చూసిన ఐ బొమ్మ రవి అపరిచితుడు మాదిరిగా ప్రవర్తించాడు. అతడికి, తనకు పరిచయం లేదని.. తొలిసారి చూస్తున్నట్టు నాటకం ఆడాడు. అంతేకాదు, తాను ఐ బొమ్మ వెబ్సైటు నడపడం లేదని.. మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే నన్ను ప్రశ్నించండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు.. దీంతో ఈ కేసు విచారణ మరింత జటిలం అవుతోందని తెలుస్తోంది.