Hyderabad: భారతీయ వివాహ వవ్యస్థకు మంచి గుర్తింపు ఉంది. కుటుంబ వ్యవస్థను పాశ్యాత్య దేశాలు సైతం గౌరవిస్తాయి. అభిమానిస్తాయి. అయితే భారతీయులు మాత్రం పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్నారు. పెళ్లినాటి ప్రమాణాలను విస్మరిస్తున్నారు. దీంతో విడిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఈసంబంధాలు వెలుగు చూసినప్పుడు దాడులు, హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్య ఇందుకు మరో ఉదాహరణ.
ఏం జరిగిందంటే..
నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో నాలుగు రోజుల క్రితం జట హత్యలు జరిగాయి. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనంత పద్మనాభస్వామి ఆలయ సమీపంలోని గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి, యువకుడిని గుర్తించారు. యువకుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్(25)గా, మహిళను ఛత్తీస్‌గడ్‌కు చెందిన బిందు దివాకర్(25)గా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కొద్ది రోజులు ముందు బిందు, సాకేత్ అదృశ్యమైనట్లు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో హత్యకు గురైంది వారిద్దనే అని నిర్ధారించారు. ఈ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఉపాధి కోసం వచ్చి,,,
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు, దివాకర్ దపంతులు ఉపాధి కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ దంపతులు మొదల్లో శంకర్‌పల్లిలో ఉండేవారు. దివాకర్ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అక్కడ నివసించే సమయంలో హౌస్‌కీపింగ్ పనులు చేసే సాకేత్‌తో బిందుకు పరిచయం ఏర్పడింది. అది వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం దివాకర్‌కు తెలియడంతో శంకర్‌పల్లి నుంచి వెళ్లిపోయారు. వనస్థలిపురంలోని చింతల్‌కుంటలో ఉంటున్నారు. అయినా బిందు, సాకేత్ కూడా తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం బిందు, సాకేత్ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో తన భార్య కనిపించడం లేదని దివాకర్ జనవరి 8న వనస్థలిపురంలో ఫిర్యాదు చేశాడు. ఇక సాకేత్ కనిపించడం లేదని అతని సోదరుడు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో జనవరి 11న ఫిర్యాదు చేశాడు.
శవాలుగా గుర్తింపు..
ఈ క్రమంలో జనవరి 14న నార్సింగ్ పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశఋలించారు. క్వారీ గుంత వద్ద సాకేత్ మృతదేహం ఉండగా ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై గ్రానైట్ రాయితో కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కొద్ది దూరంలో బిందు మృతదేహం ఉంది. తలపై కొట్టినట్లు గాయాలు ఉన్నాయి. ఈనెల 11న వీరిద్దరూ హత్యకు గురై ఉంటారని తెలుస్తోంది. ఘటనస్థలంలో నలుగురికి మించి ఉండొచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే ప్రదేశంలో మద్యం సీసాలు కూడా లభించాయి. అయితే హత్యకు ముందు ఏం జరిగిందనన కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వ్యభిచారం చేయిస్తూ…
దర్యాప్తులో పోలీసులు షాకింగ్ విషయం గుర్తించారు. బింతులో షాకేత్ వ్యభిచారం చేయింస్తున్నట్లు నిర్ధారించినట్లు తెలిసింది. ఈనెల 8న వనస్థలిపురం వెళ్లిన సాకేత్ బైక్‌పై బిందును తీసుకని నానక్‌రామ్‌గూడకు వెళ్లాడు. అక్కడ ఓ మిత్రుడి గదిలో మూడు రోజులు ఉన్నారు. 11న ఫోన్‌కాల్ రావడంతో సాకేత్, బిందు అనంతపద్మనభస్వామి గుట్టల వద్దకు వెళ్లారు. అక్కడున్నవారితో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత గొడవ జరిగి హత్యలకు దారితీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఐదు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఓ బృందం మధ్యప్రదేశ్‌కు కూడా వెళ్లినట్లు తెలిసింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Hyderabad she has three children he is not married whammo finally what happened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com