Crime News : రీల్స్… రీల్స్… రీల్స్… ప్రస్తుతం ట్రెండ్ అంతా ఇదే నడుస్తోంది. ఎక్కడ ఏం సందర్భంలో ఉన్నా కూడా రీల్స్ చేస్తూ పోస్టు చేయడం కామన్ అయిపోయింది. సంతోషంగా చేసుకునే ఫంక్షన్ల నుంచి బాధలో ఉన్న సందర్భంలోనూ రీల్స్ ప్రేమికులు రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. రీల్స్‌కు జనాలు అంతలా అడిక్ట్ అవుతున్నారు. అయితే.. ఈ రీల్స్‌ల్లోనూ ఒక్కోసారి తమ పిచ్చిని కూడా ప్రదర్శిస్తున్నారు కొందరు. ఏకంగా మర్డర్లు చేస్తూ వాటిని రీల్స్ రూపకంగా పోస్ట్ చేస్తున్నారు. సూసైడ్ చేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. లేదంటే వారు చేసే సాహసాలను రీల్స్ రూపకంగా అందిస్తున్నారు. మొన్నటికి మొన్న రోడ్లపై డబ్బులు వెదజల్లుతూ ఓ యూట్యూబర్ హల్‌చల్ చేశాడు. చివరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొందరైతే రీల్స్ కోసం పోలీస్ స్టేషన్లను వాడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నిన్న జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యాడు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యఅనుచరుడిని మర్డర్ చేశారు. గంగారెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసిన నిందితుడు సంతోష్ అనే వ్యక్తి. కారణాలేంటో తెలియకున్నా.. గంగారెడ్డిని ముందుగా కారుతో ఢీకొట్టి ఆ తరువాత విచక్షణారహితంగా కత్తితో దాడిచేశాడు. 18 సార్లు పొడిచి దారుణంగా హతమార్చాడు. దాంతో జగిత్యాల వ్యాప్తంగా ఈ దారుణం సంచలనం అయింది. హత్య చేసిన వెంటనే సంతోష్ మరో కారులో అక్కడి నుంచి పారిపోయాడు. అంటే.. ఓ ప్లాన్ ప్రకారం గంగారెడ్డిని హతమార్చారనేది అర్థం చేసుకోక తప్పదు.
అయితే.. హత్య చేసిన సంతోష్‌పై ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వైరల్ అయింది. హత్యచేసిన నిందితుడు సంతోష్ వెంటనే స్థానిక రూరల్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఆయన అతను ఆ పోలీస్ స్టేషన్‌లో చేసిన రీల్ కాస్త వైరల్ అయింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఓ హంతకుడికి పోలీసులు ఆ స్థాయిలో సపోర్టు చేస్తున్నారని విమర్శించారు. తనకు ప్రాణహానీ ఉన్నదని గతంలో గంగారెడ్డి పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులకు సంతోష్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంతోనే పట్టించుకోలేదని పేర్కొన్నారు. అందుకు ఈ వీడియో కూడా సాక్షమని తెలిపారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. ఈ రీల్స్‌పై జగిత్యాల రూరల్ పోలీసులు స్పందించారు. ఆ వీడియో గతంలోనిదని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లలో కూడా రీల్స్ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేస్తున్న సమయంలో అడ్డుకోకుండా పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లపై ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాటి వారిని ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. తాజాగా వైరల్ అయిన ఈ ఘటనను అయినా సీరియస్‌గా తీసుకొని పోలీసులు, వారి ఉన్నతాధికారులు కట్టడికి చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: He brutally killed and made reels in the police station twist in the murder case of jeevan reddys follower
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com