Fake IPS Officer Arrested: ఒంటిమీద ఖాకీ యూనిఫామ్ ఉంది.. సర్వీస్ రివాల్వర్.. నెత్తి మీద టోపీ.. మంచి లెదర్ షూస్… చేతికి గడియారం.. మూడు స్మార్ట్ ఫోన్లు.. ఆయన వ్యవహారం చూస్తే మామూలుగా లేదు. పైగా అతను తాను ఏ డీజీపీ అని పరిచయం చేసుకున్నాడు..భారీ కాన్వాయ్ తో పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పోలీసులు కూడా ఆయనకు పోటీపడి సెల్యూట్ చేశారు. కానీ ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది.
Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది
దొంగలు పోలీసులు అవతారం ఎత్తడం సినిమాలోనే మనం చూసుంటాం. నిజ జీవితంలో అలా జరగడానికి అవకాశం లేదు. వెనకటి కాలంలో అలా జరిగిందేమో గాని.. నేటి నవీన కాలంలో అటువంటి ఘటనలకు ఆస్కారం లేదు. అయితే నేటి స్మార్ట్ కాలంలో ఓ వ్యక్తి తనను తాను పోలీస్ గా మార్చుకున్నాడు. ఏకంగా ఏడిజిపి స్థాయికి చేర్చుకున్నాడు. అంతేకాదు భారీ కాన్వాయ్ తో సినిమాకు మించిన హంగామా చేశాడు. బుగ్గ కారుతో రోడ్డెక్కి హల్చల్ చేశాడు. చివరికి నిజమైన పోలీసుల చేతిలో అరెస్టయి.. జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దోల్ పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ నుంచి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సుప్రియో ముఖర్జీ.. ఉన్నత విద్యావంతుడు. కాకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు. పైగా అతడికి పోలీసు ఉద్యోగం ఉంటే చాలా ఇష్టం. అందులోనూ దర్పాన్ని ప్రదర్శించడం అంటే మరింత ఇష్టం. అందువల్లే యూనిఫామ్ ధరించాడు. బుగ్గ కారు సమకూర్చుకున్నాడు. ఫేక్ ఐడి సృష్టించుకున్నాడు. సర్వీస్ రివాల్వర్ కొనుగోలు చేశాడు. ఇతర డిజిటల్ వస్తువులను కూడా తన వెంట ఉంచుకున్నాడు. అలా పశ్చిమ బెంగాల్ దాటి రాజస్థాన్లోకి ప్రవేశించాడు. తనను తాను ఏ డిజిపి స్థాయి అధికారిగా పరిచయం చేసుకున్నాడు. పోలీసులతో రాచమర్యాదలు అందుకున్నాడు. పోలీస్ సిబ్బందిలో కొంతమందికి ముఖర్జీ వ్యవహార శైలి పట్ల అనుమానం రావడంతో లోతుగా పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వారు క్రాస్ చెక్ చేసుకోవడంతో ముఖర్జీ వ్యవహారం బయటపడింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా ఏ డీజీపీ అధికారి అసలు గుట్టు బయటపడింది. దీంతో రాజస్థాన్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.