Rajamouli Varanasi Movie: ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న దర్శకుడు రాజమౌళి… ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేసిన ఘనత తనకే దక్కుతుంది. ప్రస్తుతం అయిన ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు.. రాజమౌళి ఇంతకుముందు చేసిన బాహుబలి సినిమాలతో హాలీవుడ్ రేంజ్ మేకింగ్ అయితే చూపించాడు అంటు చాలామంది అతన్ని ప్రశంసించారు. ముఖ్యంగా హాలీవుడ్ డైరెక్టర్లు అయిన జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళి ని ఎంకరేజ్ చేయడం విశేషం…
ఇక వారణాసి విషయంలో జేమ్స్ కామెరూన్ తో పాటు స్టీవెన్ స్టీల్ బర్గ్ సైతం రాజమౌళిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వారణాసి సినిమా స్క్రిప్ట్ ని కూడా ఈ ఇద్దరు దర్శకులకు రాజమౌళి చెప్పారట. వాళ్ళు s సైతం కథ బాగుంది దాన్ని టెక్నికల్ గా చాలా బాగా తెరకెక్కించగలిగితే సినిమా అద్భుతంగా వస్తుందని చెప్పినట్టుగా తెలుస్తుంది.
Also Read: హీరోల ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్న దర్శకులు…
ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తనకంటూ ఒక ఐడెంటిటి ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… వారణాసి సక్సెస్ అయితే రాజమౌళి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల పక్కన నిలుస్తాడు. ఇక వారణాసి సినిమా కోసం 1500 కోట్లు బడ్జెట్ ని కేటాయిస్తున్నారు.
ఈ మూవీ తర్వాత చేయబోయే సినిమా కోసం 2000 కోట్లకు పైన బడ్జెట్ ని కేటాయించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడట. సినిమాను మించి సినిమాలు చేస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకోవడం రాజమౌళికి మాత్రమే దక్కిందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…ఇక రాజమౌళి చేసే సినిమాల వల్ల ఇండియా సినిమా స్థాయి పెరుగుతుంది. అలాగే తెలుగు సినిమా ఖ్యాతి కూడా ప్రపంచం నలుమూలాల వ్యాపిస్తుంది…ఇక రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం…