Money Heist Series Steals: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటుంటారు కదా.. దరిద్రాలను తీర్చుకోవడానికి ఎన్ని ఉపాయాలైనా సరే రచించవచ్చు. కానీ ఆ ఉపాయాలను మంచికి ఉపయోగించుకోవాలి. న్యాయపరమైన.. ధర్మపరమైన పనులకు వాడుకోవాలి. అలాకాకుండా మోసాలకు.. దుర్మార్గాలకు పాల్పడేందుకు వాడితే.. అంతిమంగా కటకటాల పాలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో కూడా అటువంటి వ్యవహారానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు. చివరికి దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నారు.
ఇటీవల కాలంలో ఓటిటి ల హవా పెరిగిపోయింది. అందులో వెబ్ సిరీస్ లు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో దోపిడి తరహ, నేర తరహా కథలు ఎక్కువైపోయాయి. వాటిని వెబ్ సిరీస్ ల మాదిరిగా చూసి వదిలేస్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ కొంతమంది వ్యక్తులు ఆ వెబ్ సిరీస్ లను స్ఫూర్తిగా తీసుకుని నేరమయ కార్య కలాపాలకు పాల్పడుతున్నారు. అటువంటి ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చివరికి జైలుకు పంపించారు.
హాలీవుడ్లో money heist అనే వెబ్ సిరీస్ చాలా ఫేమస్. అందులో డబ్బు సంపాదించడానికి కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడతారు. ప్రజల బలహీనతల మీద దెబ్బ కొడతారు.. అతి ఆశను చూపించి భారీగా దండుకుంటారు. చివరికి పోలీసులకు దొరికిపోతారు. సేఫ్ ఆ స్టోరీ మాదిరిగానే ఢిల్లీకి చెందిన ఒక గ్యాంగ్ ఏకంగా 150 కోట్లు దోచుకుంది. ఆ బ్యాగుల వ్యక్తుల పేర్లు అర్పిత్ (ప్రొఫెసర్), ప్రభాత్(అమాండా), అబ్బాస్ (ఫ్రెడ్జీ) తమ పేర్లను వెబ్ సిరీస్ లో మాదిరిగా మార్చుకున్నారు. ఆ తర్వాత అసలు మోసానికి తెర లేపారు. సోషల్ మీడియాలో అనేక విధాలుగా గ్రూపులు ఏర్పాటు చేసి.. స్టాక్ మార్కెట్లో టిప్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత అధిక మొత్తాల్లో డబ్బులు ఇస్తామని ఆశ పెట్టారు. ఏకంగా కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత వారు బోర్డు తిప్పేశారు. దీంతో అనుమానం వచ్చిన అనేకమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో వారంతా కూడా రెండు రాష్ట్రాలలో దాదాపు 150 కోట్ల వరకు దోపిడీ చేశారని తేలింది. ఇది అతి పెద్ద కేసు కావడంతో పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..