Ind Vs SA Test Series: టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో టి20 సిరీస్ ఆడుతోంది. ఇది పూర్తిగా గానే స్వదేశం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు భారత జట్టును ప్రకటించింది మేనేజ్మెంట్. ముఖ్యంగా సంచలన ఆటగాడికి అవకాశం కల్పించింది. దీంతో జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ జరిగినప్పుడు క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి అతని పాదానికి తగిలింది. ఆ తర్వాత ఆ గాయం తీవ్రమైంది. దీంతో అతడు మైదానం నుంచి వెంటనే వెళ్లి పోవాల్సి వచ్చింది. దాదాపు నాలుగు నెలలపాటు అతడు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో అతడు ఆసియా కప్, వెస్టిండీస్ సిరీస్, ఇతర మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సంపాదించడంతో మేనేజ్మెంట్ అతడిని దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసింది. ఇటీవల బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో అతడు అద్భుతమైన ప్రతిభ చూపించాడు. భారత ఏ జట్టుకు నాయకత్వం వహించిన అతడు రెండవ ఇన్నింగ్స్ లో కీలకమైన 90 పరుగులు చేశాడు. అంత కాదు మూడు వికెట్ల తేడాతో జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నవంబర్ 6న అధికారిక రెండవ టెస్టు జరుగుతున్న నేపథ్యంలో.. టీమ్ ఇండియాకు అతడు సారధిగా వ్యవహరిస్తాడు.. రాహుల్, సాయి సుదర్శన్, జూరెల్, దేవదత్, కులదీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ వంటి వారు కూడా ఇండియా ఏ జట్టులో ఉన్నారు.
ఇటీవల వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్లో జూరెల్ రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో రాహుల్, జైస్వాల్, సుదర్శన్, గిల్ మొదటి నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. పంత్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. జడేజా, సుందర్, అక్షర్ స్పిన్ ఆల్ రౌండర్లు గా వ్యవహరిస్తారు.. నితీష్ రెడ్డి మీడియం పేస్ ఆల్ రౌండర్ గా జట్టులో ఉన్నాడు. కులదీప్ యాదవ్ మరో ఆప్షన్ గా జట్టులో ఉన్నాడు. బుమ్రా, సిరాజ్, ఆకాశ్ పేస్ బాధ్యతను మోస్తారు. ఇక ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ నవంబర్ 14 నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఏరియాలో జరుగుతుంది. రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి గౌహతి స్టేడియంలో జరుగుతుంది.
ఇక వన్డే సిరీస్ కు ఇండియా ఏ జట్టుకు సారధిగా తిలక్ నియమితుడయ్యాడు. నవంబర్ 13 నుంచి రాజ్కోట్ దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగే మూడు వన్డే మ్యాచ్లో సిరీస్ కు కోహ్లీ, రోహిత్ శర్మ ను ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేయలేదు. తిలక్ వర్మ ఇండియా ఏ జట్టుకు సారధిగా వ్యవహరిస్తాడు. రుతు రాజ్ గైక్వాడ్ ఉపసారథిగా ఉంటాడు. అభిషేక్ శర్మ, పరాగ్, కిషన్, ఆయుష్ బదోని, నిశాంత్ సింగ్, నిగం, మానవు సుతార్, హర్షిత్, అర్ష్ దీప్ సింగ్, ప్రసిద్, ఖలీల్, ప్రబ్హ్మద్ సింగ్ వంటి వారు వన్డే జట్టులో ఆడతారు.