India Women Team: అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించింది. దశాబ్దాల కలను నిజం చేసింది. తద్వారా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల సరసన నిలిచింది టీం ఇండియా. ఈ వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా తొలి రెండు లీగ్ మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడు ఓటములు ఎదుర్కొంది.. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఫైనల్ మ్యాచ్లో వీరోచితమైన పోరాటం చేసి అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తో చిరస్మరణీయ గెలుపు అందుకొని.. ట్రోఫీ ని దక్కించుకుంది.
ఈ విజయం ద్వారా నూరుకోట్లకు పైగా భారతీయుల కలను టీమిండియా నిజం చేసింది.. భారత్ జట్టు విజయం సాధించిన తర్వాత.. ప్రశంసలు లభిస్తున్నాయి. బిసిసిఐ ఏకంగా 51 కోట్ల నజరానా ప్రకటించింది. ఐసీసీ 39 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చింది. టీమిండి అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో భారత జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా భారత జట్టు ప్లేయర్లతో నరేంద్ర మోడీ ఆప్యాయంగా మాట్లాడారు. ప్లేయర్లను పేరుపేరునా పలకరించారు. వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న తర్వాత.. విజయాలను సాధించిన తీరును గొప్పగా పేర్కొన్నారు. అద్భుతంగా ఆడారని.. టీమిండియా ప్రతిష్టను ప్రపంచ వేదిక ముందు రెపరెపలాడించారని భారత ప్లేయర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. అంతేకాదు ఫిట్ ఇండియా పై ప్రచారం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ప్లేయర్లను కోరారు.
ఆ తర్వాత కెప్టెన్ హర్మన్, స్మృతి మందాన , భారత ప్లేయర్లు నమో అనే జెర్సీ మీద ఆటోగ్రాప్ లు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానుక ఇచ్చారు. ఆ ఊహించని కానుకను చూసిన ప్రధానమంత్రి ఆశ్చర్యపోయారు. మీరు ఈ దేశపు గొప్ప బిడ్డలు అంటూ వారిని కొనియాడారు. ఈ సందర్భంగా స్మృతి, హర్మన్ 2017 నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. నాడు ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన తర్వాత.. ప్రధానమంత్రి తమ వద్దకు వచ్చారని.. ఓడిపోయిన తమలో నిరాశను దూరం చేశారని.. ధైర్యాన్ని నింపారని.. నాటి రోజులు తమలో ఎంతో ఉత్తేజం నింపాయని స్మృతి, హర్మన్ పేర్కొన్నారు.
మాటల పరంపర పూర్తి అయిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లు తేనీరు స్వీకరించారు. ఆ తర్వాత అద్భుతమైన విందును ఆరగించారు. ప్రతి ప్లేయర్ ను ప్రధానమంత్రి పరిచయం చేసుకున్నారు. గొప్పగా ఆడారంటూ ప్రశంసించారు. ఈ స్ఫూర్తిని ఇలానే కొనసాగించాలని.. దేశానికి అద్భుతమైన విజయాలు అందించాలని వారికి సూచించారు.. టీం ఇండియా ప్లేయర్ల రాకతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం సందడిగా మారింది.. ప్రతి ప్లేయర్ ప్రధానమంత్రి తో సెల్ఫీ తీసుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.