Visakhapatnam: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో పెద్దలు చెప్పినట్టు మిగతా కుటుంబ సభ్యులు వినేవారు. కుటుంబంలో ఏవైనా గొడవలు జరిగితే పెద్దలు చెప్పినట్టు మిగతావారు వినేవారు. అందువల్ల కుటుంబాలు బలంగా ఉండేవి.. బంధాలు మరింత దృఢంగా ఉండేది.. దీనికి తోడు సకుటుంబ సపరివార సమేతం అనే మాటకు పర్యాయపదంగా కుటుంబాలు విరజిల్లేవి. కానీ ఇప్పుడు పరిస్థితి రాలేదు.. ఉమ్మడి కుటుంబం స్థానంలో వేరు కుటుంబాలు పెరిగిపోయాయి. ఉద్యోగాల కోసం.. ఇతర వ్యాపారాల కోసం నగరాలలో ఉండడం.. నివసించడం పరిపాటిగా మారిపోయింది.
ఇలాంటి కుటుంబాలలో అత్తలు ఉంటే కోడళ్ళకు ఇబ్బందికరంగా ఉంటున్నది. అత్తలు ఏమైనా చెబితే కోడళ్ళకు ఎక్కడో కాలుతోంది.. కొందరు కోడళ్ళు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఇబ్బందికరంగా పరిణమించిన అత్తలపై దారుణానికి పాల్పడుతున్నారు. అటువంటి దారుణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో చోటుచేసుకుంది.. తనకు అన్ని విషయాలలో కంటగింపుగా మారిన అత్తను అంతం చేయడానికి ఈ కోడలు మాస్టర్ ప్లాన్ రూపొందించింది.. దానిని అత్యంత అద్భుతంగా అమలు చేసింది.. కానీ చివర్లో పోలీసులకు దొరికిపోయింది.
విశాఖపట్నం మహానగరంలోని పెందుర్తి ప్రాంతంలో జయంతి కనకమహాలక్ష్మి అనే మహిళ తన కొడుకు, కోడలితో నివసిస్తోంది. కనకమహాలక్ష్మి ప్రతి విషయంలోనూ స్పష్టతను కోరుకుంటుంది. తన కోడలు కూడా అలానే ఉండాలని భావించింది. దానికి తగ్గట్టుగానే తన కోడలికి అన్ని విషయాలలో సలహాలు , సూచనలు ఇచ్చేది. మొదట్లో ఆమె కోడలు ఇది కాస్త మంచిగా అనిపించినప్పటికీ.. రానూ రానూ ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆమె అత్తను ఎలాగైనా సరే అంతం చేయాలని భావించింది. ఈ క్రమంలోనే కోడలు లలిత అత్తను అంతం చేయడానికి ఒక బృహత్తరమైన ప్రణాళిక రూపొందించింది.
అత్తతో దొంగ పోలీస్ ఆట ఆడదామని లలిత చెప్పింది. దానికి అత్త ఒప్పుకుంది. ఆ తర్వాత తన అత్తను కుర్చీలో కూర్చోబెట్టింది. కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసింది. కళ్ళకు గంతలు కట్టింది. ఆ తర్వాత ఆమె ఒంటిమీద పెట్రోల్ పోసింది. దేవుడు పూజ గదిలో ఉండే దీపాన్ని బయటకి తీసుకొచ్చి తన అత్తమీదికి ఒక్కసారిగా విసిరేసింది.. దీంతో ఆ అత్త మంటల్లో కాలిపోయింది. కాపాడాల్సిన లలిత ఇంటి తలుపులు మూసి బయటికి పరుగులు పెట్టింది. తిరుగు పొరుగు వారిని పిలిచి తన అత్తమంటల్లో కాలిపోతుందని కన్నీరు కార్చింది.. ఆ తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొదట్లో దీన్ని అగ్నిప్రమాదం అనుకున్నారు. కానీ అక్కడి ఆనవాళ్లు చూస్తే వారికి అలా అనిపించలేదు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. దీంతో పోలీసులు లలితను అదుపులోకి తీస్తున్నారు.