Tragic Incident: అది ఖమ్మం నగరం.. ఆ నగరం మధ్య నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువ ప్రవహిస్తూ ఉంటుంది.. ఆ కాలువ చుట్టూ ఇటీవల కాలంలో భారీగా నివాస సముదాయాలు నిర్మితమయ్యాయి.. ఆ కాలువ పక్కన ఉన్న ట్రాక్లలో చాలామంది వాకింగ్ చేస్తుంటారు. ఉదయం.. సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తూ శరీరానికి శ్రమను కలిగిస్తుంటారు.. అలా వాకింగ్ చేస్తున్న వారిలో కొంతమందికి కాల్వ పక్కన బట్టలు కనిపించాయి. చెప్పులు కూడా దర్శనమిచ్చాయి. దీంతో పోలీసుల దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లారు.
వాకర్స్ వద్ద నుంచి ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.. చెప్పులు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారిదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. పోలీసులు విచారిస్తున్న కొద్ది ఈ కేసులో సంచలన విషయాలు చూశాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఖమ్మం నగరంలోని ఏదులాపురం ప్రాంతంలో ముత్తగూడెం అనే గ్రామం ఉంది.. ఈ గ్రామానికి చెందిన బూర శ్రీనివాసరావు అనే వ్యక్తి ఖమ్మం నగరంలోని మిఠాయి దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మొదట్లో వీరి సంసారం బాగానే ఉండేది.. ఆ తర్వాత భార్య ప్రవర్తన తీరులో మార్పు కనిపించింది. పైగా ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అయితే తమ సంబంధానికి శ్రీనివాసరావు అడ్డువస్తున్నాడని అతని భార్య భావించింది.. ఇదే క్రమంలో తన ప్రియుడితో అసలు విషయాన్ని చెప్పింది. శ్రీనివాసరావును అడ్డు తొలగించాలని అతడికి సూచించింది. ప్రియురాలు చెప్పడంతో అతని కూడా ఓకే అన్నాడు.. శ్రీనివాసరావును అంతం చేయాలని అతడు భావించాడు..
శ్రీనివాసరావును అంతం చేయడానికి ఆ వ్యక్తి ప్రణాళిక రూపొందించాడు. ఈనెల 6న విధులు ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. అతడు వచ్చే దారిలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అత్యంత కిరాతకంగా చంపేసి ఎన్ఎస్పి కాలంలో పడేశారు. అయితే ఆ వ్యక్తిని పడేస్తున్న సమయంలో దుస్తులు, చెప్పులు తొలగించి కాలువ ఒడ్డు వద్ద పడేశారు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ కిరాతకం బయటపడింది.. అంతేకాదు శ్రీనివాసరావు మృతదేహం ఎన్ఎస్పీ కాలువలో తేలియాడుతూ కనిపించింది. పోలీసులు శ్రీనివాసరావు భార్యను, ఆమె ప్రియుడిని అదుపులకు తీసుకున్నారు. ఈ దారుణంలో పాలుపంచుకున్న వారిని కూడా అరెస్ట్ చేశారు.