Cyber Frauds: సైబర్ నేరగాళ్ల కొత్త మోసం.. ఆ పనిచేస్తే మీ డబ్బు మాయం.. జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం..

ఉత్తరప్రదేశ్ కు చెందిన అనన్య అనే యువతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ద్వారా కస్టమ్స్ ఆఫీసు నుంచి కాల్ చేస్తున్నామని విదేశాలకు మీరు ఒక వస్తువును పంపిస్తున్నారని, అయితే ఇది అక్రమంగా పంపిస్తున్నారని చెప్పారు. ఆ తరువాత వీడియో కాల్ కూడా చేసి పోలీస్ డ్రెస్ లో కనిపించి ఆమెను భయపెట్టారు. దీనికి మీరు కోటి రూపాయల వరకు ఫెనాల్టీ కట్టాలని బెదిరించారు.

Written By: Chai Muchhata, Updated On : July 26, 2024 9:53 am

Cyber Frauds

Follow us on

Cyber Frauds: జీవితంలో హాయిగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే అందమైన జీవితం గడపాలంటే డబ్బు కావాలి. అవసరాలకు మాత్రమే డబ్బు సంపాదిస్తే లైఫ్ నార్మల్ గా ఉంటుంది. కానీ మిగతా వారి కన్నా.. ఇంకా సంతోషంగా గడపడానికి ఎక్కువ ధనం కావాలి. ఇందు కోసం కష్టపడి పనిచేయాలి. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కష్టపడితేనే డబ్బు వస్తుంది. మనతో పాటు మన కుటుంబ సభ్యులు బాగుండాలని రాత్రనక, పగలనక కష్టపడి డబ్బు సంపాదిస్తుంటాం. కానీ ఇదే సమయంలో ఎలాంటి కష్టం లేకుండా మోసం చేసి డబ్బు సంపాదించాలని కొందరు అనుకుంటారు. పూర్వకాలంలో డబ్బున్న వారి నుంచి భయపెట్టి లేదా ఇతర పద్దతుల ద్వారా సొమ్మును దోచుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతీది ఆన్ లైన్ ద్వారా మనీ ట్రాన్జాక్షన్ చేస్తున్నాం. దీంతో ఆన్ లైన్ దొంగలు ఎక్కువయ్యారు. వీరినే సైబర్ నేరగాళ్లు అని అంటున్నాం. ఒక వ్యక్తి నిర్వహించే ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ పై సైబర్ నేరగాళ్లకు కన్ను వేస్తున్నారు. ఏదో రకంగా వారి డీటేయిల్స్ తెలుసుకొని డబ్బును ఆన్ లైన్ లో దోచుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువవుతున్నాయి. అయితే తాజాగా కొత్త రకం మోసం బయటపడింది. విదేశాలకు ఏదైనా వస్తువు పంపించాలనుకునే వారి విషయంలో వీరు నేరాలకు పాల్పడతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనతో దేశం మొత్తం అలర్ట్ అయింది. ఇలాంటి కాల్స్ వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు చేసే కొత్త మోసం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్ కు చెందిన అనన్య అనే యువతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ద్వారా కస్టమ్స్ ఆఫీసు నుంచి కాల్ చేస్తున్నామని విదేశాలకు మీరు ఒక వస్తువును పంపిస్తున్నారని, అయితే ఇది అక్రమంగా పంపిస్తున్నారని చెప్పారు. ఆ తరువాత వీడియో కాల్ కూడా చేసి పోలీస్ డ్రెస్ లో కనిపించి ఆమెను భయపెట్టారు. దీనికి మీరు కోటి రూపాయల వరకు ఫెనాల్టీ కట్టాలని బెదిరించారు. అయితే ఆ అమ్మాయి భయపడిపోయి రూ. 2 లక్షలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆ తరువాత ఇటీవల ఓ అబ్బాయికి ఇదే రకమైన కాల్ వచ్చింది. తాము కస్టమ్స్ అధికారులమని.. మీరు విదేశాలకు వెళ్లడానికి అక్రమంగా పాస్ పోర్టు తీసుకున్నారని అన్నారు. అయితే ఆ వ్యక్తి తెలివిగా నేను అక్రమం చేస్తే మీరు దర్యాప్తు చేసి పాస్ పోర్టు సీజ్ చేయాలని అన్నాడు. మీరు ఎలాగూ పోలీసు అధికారులు అయినందువల్ల తప్పుంటేచర్చలు తీసుకోవాలని బదులు ఇచ్చాడు. దీంతో కాల్ చేసిన వారు 5 నిమిషాలు ఆగి ఆ తరువాత కట్ చేశారు.

ఇలా ఈమధ్య సైబర్ నేరగాళ్లు విదేశాలతో సత్సంబంధాలు ఉన్న వారి విషయంలో ఫ్రాడ్ చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి చెందిన అధికారులమంటూ బెదిరిస్తున్నారు. అయితే తప్పు చేయనంత వరకు ఎవరకీ భయపడాల్సిన అవసరం లేదు. అందువల్ల ముందుగానే నిబంధనల ప్రకారం అన్ని రూల్స్ పాటించండి. ఆ తరువాత ఎవరికీ డబ్బులు చెల్లించడానికి ఆస్కారం ఉండదు. ఇదే సమయంలో అనవసర కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా పోలీసు అధికారులను కలవాలని, ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ చేసేటప్పుడు ఎవరికీ డీటేయిల్స్ చెప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా కస్టమ్స్ అధికారులైనా, పోలీసులైనా నోటీసులు పంపిస్తారని, లేదంటూ నేరుగా పోలీస్ స్టేషన్ కు రప్పిస్తారని, ఇలా ఆన్ లైన్ లో ఫెనాల్టీ కట్టమని ఎవరూ అడగరని పోలీసులు చెబుతున్నారు.