https://oktelugu.com/

Karnataka: పోలీస్ స్టేషన్లో చోరీ బంగారం మాయం.. విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు..

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా బంగారు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక చోరీ జరిగింది. ఫిబ్రవరి 25న బంగారు పేట బస్సు స్టేషన్లో బంగారం వ్యాపారి గౌతమ్ చంద్ కు చెందిన రెండు కిలోల బంగారం చోరీకి గురయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 18, 2024 / 12:27 PM IST

    Karnataka

    Follow us on

    Karnataka: పోలీసులు దొంగలను పట్టుకోవాలి. సంఘ విద్రోహ శక్తులను అణిచివేయాలి. శాంతి భద్రతలను కాపాడాలి. అప్పుడే పోలీసులంటే సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. అందరిలో భయం కలుగుతుంది.. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో కొందరు పోలీసులు దొంగ పనులు చేశారు. దొంగలు చోరీ చేసిన బంగారాన్ని, విచారణ చేసి బాధితులకు అప్పగించాల్సింది పోయి, తామే దొంగలయ్యారు. అత్యాశకు పోయి చివరికి ఊచలు లెక్కబెడుతున్నారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

    కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా బంగారు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక చోరీ జరిగింది. ఫిబ్రవరి 25న బంగారు పేట బస్సు స్టేషన్లో బంగారం వ్యాపారి గౌతమ్ చంద్ కు చెందిన రెండు కిలోల బంగారం చోరీకి గురయింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు దాదాపు 1,408 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. ఆ విషయాన్ని గౌతమ్ చంద్ కు తెలియజేశారు. విచారణ అనంతరం బంగారం అప్పగిస్తామని చెప్పారు. కేసు విచారణ పూర్తయి, గౌతమ్ చంద్ కు బంగారం అప్పగిద్దామనుకుంటుండగా.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారంలో 582 గ్రాములు మాయమైంది. దీంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. బంగారం కోసం గౌతమ్ చంద్ పోలీస్ స్టేషన్ కి వస్తే.. కొద్దిరోజులైన తర్వాత రండి అని చెప్పారు. కానీ ఈలోగా బంగారం మాయంపై అంతర్గత విచారణ మొదలుపెట్టారు.. దీంతో పోలీసులకు అసలు విషయం తెలిసి నిర్ఘాంత పోయారు.

    బంగారు పేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ విభాగంలో అనిల్ అనే కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. గోల్డ్ రికవరీ టీం లో అతడు కూడా ఉన్నాడు. గౌతమ్ చంద్ కు చెందిన బంగారాన్ని దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. అయితే వారందరి కళ్ళు కప్పి, అందులో నుంచి 582 గ్రాములు తస్కరించాడు. ఆ తర్వాత వ్యక్తిగత పని ఉందని 15 రోజులపాటు సెలవు పెట్టాడు.. ఆ సెలవు గడువు పూర్తయినా కూడా అనిల్ విధుల్లో చేరలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. బంగారం మాయం కావడం, అనిల్ విధుల్లోకి రాకపోవడంతో పోలీసులు అతడిని అనుమానించాల్సి వచ్చింది. చివరికి అతని వెతికి పట్టుకొని విచారిస్తే.. ఆ బంగారాన్ని తస్కరించింది తానే ఒప్పుకున్నాడు.. ఏరా బంగారాన్ని తస్కరించేందుకు అనిల్ కు మరో నలుగురు సహకరించారు.. పోలీస్ శాఖకు మాయని మచ్చని తెచ్చిన ఈ సంఘటన పట్ల అక్కడ హోం శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. ఇక దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ శాంతరాజు పేర్కొన్నారు.. గౌతమ్ చంద్ కు బంగారాన్ని అందజేస్తామని ప్రకటించారు.